Share News

పోరాటాల ప్రతిధ్వని అరుణోదయ నాగన్న

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:41 PM

పోరాటాల ప్రతిధ్వనిగా పేరు గాంచిన అరుణోదయ నాగన్న స్వరం మూగబోవడం బాధాకరమని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమో క్రసి కేంద్ర కమిటీ నాయకులు చలపతిరావు పేర్కొ న్నారు. ఆదివారం ఎన్టీసీపీ జ్యోతినగర్‌లోని ఐఎఫ్‌టీ యూ కార్యాలయం వద్ద కామ్రేడ్‌ నాగన్న సంతాప సభను నిర్వహించారు.

పోరాటాల ప్రతిధ్వని అరుణోదయ నాగన్న

జ్యోతినగర్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి): పోరాటాల ప్రతిధ్వనిగా పేరు గాంచిన అరుణోదయ నాగన్న స్వరం మూగబోవడం బాధాకరమని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమో క్రసి కేంద్ర కమిటీ నాయకులు చలపతిరావు పేర్కొ న్నారు. ఆదివారం ఎన్టీసీపీ జ్యోతినగర్‌లోని ఐఎఫ్‌టీ యూ కార్యాలయం వద్ద కామ్రేడ్‌ నాగన్న సంతాప సభను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం చలపతిరావు మాట్లాడుతూ నాగన్న, కానూరి వెంకటేశ్వర్‌రావు, రామా రావుతో కలిసి అరుణోదయ ప్రజా సాంస్కృతిక సంస్థ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేసుకు న్నారు. నాలుగు దశాబ్దాలకుపైగా పార్టీ సిద్దాంతాలను విశ్వసిస్తూ నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ పోరా టాల స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రజాగాయకుడిగా, ప్రజా ఉద్యమంలో చురుకుగా పాల్గొని తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు.

నాగన్న ఆశయాలను లక్ష్యాలను నెరవే ర్చుటకు బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించా లని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ ఎంఎల్‌ న్యూడెమెక్రసీ జిల్లా నాయకులు నరేష్‌ అధ్యక్షత వహించగా అరు ణోదయ జిల్లా అధ్యక్షుడు బతుకుల రాజన్న, ఐఎఫ్‌టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, సహాయ కార్యదర్శి వెం కన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌, పీసీకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్‌, జీఎల్‌బీకేఎస్‌ రాష్ట్ర సహాయ కార్య దర్శి ఈదునూరి రామకృష్ణ, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్య క్షుడు గుండేటి మల్లేశం, నాయకులు రాజేశం, ఐఎఫ్‌టీ యూ జిల్లా నాయకులు బుచ్చ య్య, పుట్టపాక స్వామి, రాయమల్లు, కొమురయ్య, సుధాకర్‌, రవి, రవీందర్‌ పాల్గొన్నారు. అలాగే సభలో అరుణో దయ, ప్రజా కళాకారులు నాగన్నను స్మరిస్తూ పాటలు పాడారు.

Updated Date - Jul 20 , 2026 | 07:48 AM