Home » Peddapalli
ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని దిగుబడి సాధించిన రైతులకు దానిని విక్రయించడం సవాల్‌గా మారుతోంది. ముఖ్యంగా తేమ శాతం ఆందోళనకు గురిచేస్తోంది. నిబంధనల మేరకు ధాన్యంలో తేమ శాతం లేకపోతే కొనుగోలు చేయరు, చేసిన మద్దతు ధర లభించదు. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. తేమ కష్టాలు తొలగించేందుకు గ్రెయిన్ డ్రైయ్యర్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.
రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో త్వరలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈడీ చందన్‌కుమార్ సామంత అన్నారు. 48వ ఎన్టీపీసీ ఆవిర్భావ వేడుకలు సందర్భంగా ఏటీఎం బిల్డింగ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.
నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని రైతువేదికలో అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు.
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా చెప్పారు. శుక్రవారం సింగరేణి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడి కల్ సైన్స్‌లో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, షీ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమానికి సీపీ హాజరై మాట్లాడారు.
రామగుండం నగర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు, ప్రభుత్వం, సింగరేణి నిధులతో మరిన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు.
కొను గోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. గురువారం మీర్జంపేట, వెన్నంపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చారు.
మంథని నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం రామగిరి అతిథి గృహంలో ఇంజ నీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆయిల్‌పామ్ పంట సాగుపై జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం సాగుకన్నా అదనంగా మరో రెండు వేల ఎకరాలు సాగు లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జాతీయ యువజన ఉత్సవాలను అదనపు కలెక్టర్ దాసరి వేణు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పులమాలలు వేసి నివాళులర్పించారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నాలాలను ఆధునిక పద్ధ తిలో నిర్మిస్తున్నారు. నాలాల్లో చెత్త వేయకుండా నాలాల పైకప్పు పెన్సింగ్ వేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధి లో ఆధునికీకరిస్తున్న అన్నీ ప్రధాన నాలాల్లో ఇదే విధా నాన్ని కొనసాగిస్తున్నారు.