Share News

క్రీడలకు సమయాన్ని కేటాయించాలి

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:51 PM

చదువుతోపాటు క్రీడలకు సమయాన్ని వెచ్చించాలని ఏపీఏ జీఎం నాగేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల కబడ్డీ క్లబ్‌ ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ హైదరాబాద్‌ యూనివర్సిటీ పరిధిలోని బి జోన్‌ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ను జీఎం ప్రారంభించారు.

క్రీడలకు సమయాన్ని కేటాయించాలి

రామగిరి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): చదువుతోపాటు క్రీడలకు సమయాన్ని వెచ్చించాలని ఏపీఏ జీఎం నాగేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల కబడ్డీ క్లబ్‌ ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ హైదరాబాద్‌ యూనివర్సిటీ పరిధిలోని బి జోన్‌ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ను జీఎం ప్రారంభించారు. రెండు రోజుల పాటు లీగ్‌ కం నాటౌట్‌ పద్ధతిలో జరుగుతున్న టోర్నమెంట్‌లో పాల్గొంటున్న 8 టీంల నుంచి జీఎం ముందుగా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు. చదువు వల్ల వచ్చే ఒత్తిడిని క్రీడలతో తగ్గించుకోవచ్చన్నారు. మానసిక వికాసంతో పాటు శారీరక ధృడత్వం వస్తుందన్నారు. అనంతరం క్రీడాకారులతో పరిచయం చేసుకున్నారు.

ఫఫైనాల్‌లో వాగ్ధేవి, మంథని జట్లు

లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో జరిగిన టోర్నమెంట్‌లో వరంగల్‌కు చెందిన వాగ్ధేవి(అటానమస్‌), మంథని జేఎన్‌టీయూ మూడేసి మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. మొదటి సెమిఫైనల్‌లో వాగ్ధేవి(అటానమస్‌), వాగ్ధేవి(జేఎన్‌టీయూ) జట్టుపై 24/21 గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో సెమిఫైనల్‌లో మంథని జేఎన్‌టీయూ (ఏ) జట్టు జేఎన్‌టీయూ (బి) జట్టు పై రెండు పాయింట్ల(23/21)తేడాతో గెలిచి ఫైనాల్‌కు చేరుకుంది. సోమవారం ఫైనాల్‌ పోటీ జరుగుతుందని క్లబ్‌ నిర్వాహకులు ఎల్‌ సత్యనాయక్‌, లక్ష్మన్‌, శ్రీనివాస్‌లు తెలిపారు. కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ పింగళి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పిడి సునీల్‌కుమార్‌, రెఫరీలు కొమురోజు శ్రీనివాస్‌, ముఖేష్‌కుమార్‌, సత్యం, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 11:51 PM