Share News

ట్రాఫిక్స్‌ సిగ్నల్స్‌తో ప్రమాదాల నివారణ

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:27 AM

నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలను తొలగించడానికి సిగ్నల్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సోమవారం పూసాల రోడ్డు చౌరస్తాలో ఏర్పాటు చేసిన సిగ్నల్‌నుడీసీపీ రాంరెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు.

ట్రాఫిక్స్‌ సిగ్నల్స్‌తో ప్రమాదాల నివారణ

సుల్తానాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలను తొలగించడానికి సిగ్నల్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సోమవారం పూసాల రోడ్డు చౌరస్తాలో ఏర్పాటు చేసిన సిగ్నల్‌నుడీసీపీ రాంరెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్‌ చౌర స్తా నుంచి గట్టెపల్లి రోడ్డు వరకు త్వరలో సిగ్నల్‌ వ్యవస్థను ప్రారంభిస్తా మన్నారు. ఎంపీడీఓ కార్యాలయం సమీపాన రూ.50 లక్షలతో ఐలాండ్‌ వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అంతటి అన్నయ్య, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ ప్రకాష్‌ రావు, కాంగ్రెస్‌ నాయకులు శ్రీగిరి శ్రీనివాస్‌, సాయిరి మహేందర్‌, వ్యాపారస్తులు నగునూరి అశోక్‌కుమార్‌, మాడూరి ప్రసాద్‌, చకిలం మారుతి, అబ్బయ్యగౌడ్‌, రవీందర్‌, ప్రకాష్‌ రావు, రాజమల్లు పాల్గొన్నారు.

పెద్దపల్లిటౌన్‌, (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ సమస్యలు తొలగించేందుకే సిగ్న ల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్‌ వ్యవ స్థను డీసీపీ రాంరెడ్డి, ట్రాఫిక్‌ ఏసిపి సిహెచ్‌ శ్రీనివాస్‌, అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు.

Updated Date - Jan 27 , 2026 | 12:27 AM