జీపీ కార్మికుల సమ్మె నోటీస్
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:14 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్ర వరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు మంగళవారం మండలంలోని జీపీ కార్మికులు ఎంపిడీవో శ్రీనివాస్‌కు సమ్మె నోటీస్ అందజేశారు.
పెద్దపల్లి రూరల్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్ర వరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు మంగళవారం మండలంలోని జీపీ కార్మికులు ఎంపిడీవో శ్రీనివాస్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. కార్మికులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించిన జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్‌లు సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు. సీఐటియూ రాష్ట్ర కమిటీ పక్షాన పాల్గొననున్నట్లు తెలిపారు. సమ్మె నోటీస్ అందించిన వారిలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఖాజా, మండల అధ్యక్షుడు దొంత కనుకయ్య, ప్రధాన కార్యదర్శి జంగపల్లి నరేష్, కోశాధికారి బందరి అశోక్, ఉపాధ్యక్షులు ఎండి ముస్తాఫా, కమిటి సభ్యులు రాజశేఖర్, తదితర కార్మికులు పాల్గొన్నారు.