దేశాభివృద్ధిలో ఎన్టీపీసీ కీలక భాగస్వామి
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:24 AM
దేశాభివృద్ధిలో ఎన్టీపీసీ కీలక భాగస్వామిగా, పారిశ్రామిక పురోగభివృద్ధికి ఎన్టీపీసీ ఎంతో దోహదం చేస్తోందని రామగుండం ప్రాజెక్టు ఈడీ చందన్‌కుమార్ సామంత పేర్కొన్నారు. సోమవారం ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
జ్యోతినగర్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధిలో ఎన్టీపీసీ కీలక భాగస్వామిగా, పారిశ్రామిక పురోగభివృద్ధికి ఎన్టీపీసీ ఎంతో దోహదం చేస్తోందని రామగుండం ప్రాజెక్టు ఈడీ చందన్‌కుమార్ సామంత పేర్కొన్నారు. సోమవారం ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన ప్రసంగిస్తూ ఎన్టీపీసీ దక్షిణాదికి 40 ఏళ్లుగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోందన్నారు. ఉద్యోగులు, అధికారులు, కాంట్రాక్టు కార్మికుల కృషి ఫలితంగానే రామగుండం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందన్నారు. సిబ్బంది అంకితభావంతో పని చేస్తూ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేడియం ఆవరణలో సీఐఎస్‌ఎఫ్ జవాన్లు, విద్యార్థులు పరేడ్ నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రాజెక్టులోని ఉత్తమ ఉద్యోగులకు ఈడీ చందన్‌కుమార్ ప్రశంసాపత్రాలను అందించారు. పలు విభాగాల జీఎంలు, హెచ్‌ఓడీలు, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఉద్యోగులు మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.