శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:22 AM
రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కోల్‌సిటీ, జనవరి 26(ఆంధ్రజ్యోతి): రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, పోలీ సులు నిరంతరం చట్టాన్ని గౌరవిస్తూ విధులు నిర్వహిం చాలని సూచించారు. రాజ్యాంగం ద్వారా దేశ పౌరులకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి మౌలిక విలువలు లభించాయని తెలిపారు. ప్రజల భద్రత శాంతిభద్రతల పరిరక్షణ పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. చట్టాలను గౌరవిస్తూ, సామాజిక బాధ్యతతో ప్రతి పౌరుడు మెలగాలని సూచించారు. మన రాజ్యాంగం అందించిన స్ఫూర్తితో మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తు న్నామని తెలిపారు. ప్రతి భారతీయుడి హృదయంలో గణతంత్ర దినోత్సవం ఒక ప్రత్యేకమైన దినమన్నారు. ఎందరో త్యాగధనుల త్యాగఫలితమే గణతంత్ర దినోత్సవ మని, వారి ప్రాణత్యాగాల వల్లనే మనం నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. అలాంటి మహనీయులను ఎప్ప టికీ స్మరించుకోవాలని అన్నారు. పోలీసు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు సిబ్బందికి సీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ కే శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, ఏసీపీ స్పెషల్ బ్రాంచ్ నాగేంద్రగౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ల్లు, వివిధ ఇన్‌స్పెక్టర్ల్లు, ఏఓ శ్రీనివాస్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, వివిధ వింగ్స్ సిబ్బంది, పాల్గొన్నారు.