Share News

బ్యాంకు ఉద్యోగుల నిరసన

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:13 AM

బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజులే పని దినాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖనిలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం నిరసనకు దిగారు. యూనై టెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్లు ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా గోదావరిఖనిలోని అన్నీ బ్యాంకులు సమ్మెలో పాల్గొన్నాయి.

బ్యాంకు ఉద్యోగుల నిరసన

కళ్యాణ్‌నగర్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజులే పని దినాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖనిలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం నిరసనకు దిగారు. యూనై టెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్లు ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా గోదావరిఖనిలోని అన్నీ బ్యాంకులు సమ్మెలో పాల్గొన్నాయి. బ్యాంకుల ఉద్యోగులు గోదావరిఖని మార్కండేయకాలనీ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎఫ్‌బీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సాగర్‌రెడ్డి మాట్లాడుతూ అన్నీ బ్యాంకుల్లో ఉద్యోగుల పై పని ఒత్తిడి ఉందని, రోజు వందలా మంది వినియోగదారులతో మాట్లాడుతూ మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, దీనికి ఐదు రోజుల పని విధానమే పరిష్కారమని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాస్‌, దిలీప్‌ కుమారర్‌, రమేష్‌, కొమిరినేని మోహన్‌రావు, దిలీప్‌ కుమార్‌, ఉదయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:13 AM