Share News

బొగ్గు రంగ సంస్థల్లో సింగరేణి నంబర్‌ వన్‌

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:25 AM

దేశంలోని బొగ్గు రంగ సంస్థల్లో సింగరేణి సంస్థ నంబర్‌ వన్‌గా ఉందని ఆర్‌జీ-1 ఏరియా జీఎం లలిత్‌కుమార్‌ అన్నారు. సోమవా రం గణతంత్ర వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి జీఎం(క్వాలిటీ) సుజాయి మజుందార్‌ హాజరయ్యారు.

బొగ్గు రంగ సంస్థల్లో సింగరేణి నంబర్‌ వన్‌

గోదావరిఖని, జనవరి 26(ఆంధ్రజ్యోతి): దేశంలోని బొగ్గు రంగ సంస్థల్లో సింగరేణి సంస్థ నంబర్‌ వన్‌గా ఉందని ఆర్‌జీ-1 ఏరియా జీఎం లలిత్‌కుమార్‌ అన్నారు. సోమవా రం గణతంత్ర వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి జీఎం(క్వాలిటీ) సుజాయి మజుందార్‌ హాజరయ్యారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, అధికారుల కృషి తో దేశ పారిశ్రామిక రంగాల్లో సింగరేణి సంస్థ ముందుం దన్నారు. మారుతున్న బొగ్గు అవసరాలు, డిమాండ్‌ నేప థ్యంలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలని సూచిం చారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, అంతర్గత రోడ్లు, విద్యుత్‌, మంచినీటి సౌకర్యంతోపాటు మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. రామగుండం రీజియన్‌లో రక్షిత మంచినీటిని అందించడానికి రూ.35 కోట్లతో ర్యాపిడ్‌ గ్రావిటీ ఫిల్టర్‌ పనులు పూర్తి కానున్నట్టు తెలిపారు. గోదావరిఖని పట్టణ అభివృద్ధిలో భాగంగా చౌరస్తాలో నిర్వహించతలపెట్టిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ దశలో ఉన్నాయని, సింగరేణి ఏరియా హాస్పిటల్‌ను సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చడానికి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు పేర్కొన్నారు.

యైుటింక్లయిన్‌కాలనీ, (ఆంధ్రజ్యోతి): ఆర్జీ-2 ఏరియాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జీఎం బండి వెం కటయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అబ్దుల్‌ కలాం స్టేడియంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జీఎం జాతీయ జండా ఎగురవేసి ఎస్‌అండ్‌పీసీ, పాఠశాల విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉత్తమ కార్మికులను సన్మానించారు. దేశ పారిశ్రామిక అభివృద్ధిలో సింగరేణి కీలక భూమిక పోషిస్తున్నదని, రాష్ట్ర విద్యుత్‌ అవసరాలకు సరిపడా బొగ్గును సరఫరా చేయడం మన బాధ్యత అన్నారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఏఐటీయూసీ బ్రాంచి సెక్రె టరీ జిగురు రవీందర్‌, సేవా అధ్యక్షురాలు వనజావెంకట య్య, అధికారుల సంఘం అధ్యక్షుడు, ఎస్వోటూ జీఎం రాముడు, అధికార ప్రతినిధి అరవిందరావు ఏరియా పరిధి లోని గనులు, విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఓసీపీ-3లో ప్రాజెక్టు ఆఫీసర్‌ ఉదయ్‌ హరిజన్‌ ప్రాజెక్టు ఆఫీస్‌ ఆవరణలో జెండా ఆవిష్కరించారు. ఓసీపీ-1 సీహెచ్‌పీ ఆవరణలో బీఎంఎస్‌ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ వేణుగోపాల్‌ రావు జాతీయ జండాను ఎగుర వేశారు. అనంతరం మహిళా కార్మికులను సన్మానించారు.

రామగిరి, (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు సింగరేణి మణిహా రంగా ఉందని ఆర్జీ-3 జీఎం మధుసూదన్‌ అన్నారు. జీఎం కార్యాలయం, రాణిరుద్రమాదేవి క్రీడాప్రాంగణంలో జెండాను ఆవిష్కరించారు. క్రీడప్రాంగణం లో ఏర్పాటు చేసిన వేడుకల్లో జీఎం మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తితోపాటు సోలార్‌, థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తికి అడుగు వేసిందన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షే మంతోపాటు ప్రభావిత గ్రామాల అభివృద్ధి చేపడుతుంద న్నారు. అనంతరం ఉత్తమ కార్మికుల కుటుంబాలను సన్మానించారు. ఉత్తమ సెక్యూరిటిగార్డులను పారితోషికంతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. విద్యార్థులచే సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏపిఏ జీఎం నాగే శ్వర్‌రావు, ప్రాజెక్టు అధికారి రాజశేఖర్‌ ఐలయ్య, కొల శ్రీని వాస్‌, సుదర్శనం, సెక్యూరిటి అధికారి షబ్బీరుద్దీన్‌, రాజేంద్ర కుమార్‌, గుర్తింపు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 12:25 AM