• Home » Peddapalli

Peddapalli

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దకల్వలలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పోరుబాట పిలుపు మేరకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

మున్సిపల్‌ సమస్యలు పరిష్కరించాలని ధర్నా

మున్సిపల్‌ సమస్యలు పరిష్కరించాలని ధర్నా

పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్‌ సమస్య లను వెంటనే పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మిస్తాం

పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మిస్తాం

పత్తిపాక రిజర్వాయర్‌ను కట్టి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆదివారం ధర్మపురి ఆలయంలో అభివృద్ధి పను లకు శంకుస్థాపన నిమిత్తం వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధర్మారం రోడ్‌లో పాల్గొనాల్సి ఉంది.

అడ్డుకునేవారే లేరు..

అడ్డుకునేవారే లేరు..

‘మమ్మల్ని అడిగేదెవరు..? మా వాహనాన్ని ఆపేదెవరు..?’ అనే విధంగా జిల్లాలో ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాల జోరు అంతకంతకు పెరుగుతోంది. ఇసుక, కంకర, మట్టి, గ్రానైట్‌, సరకు బస్తాలు, ఇతరత్రా సామగ్రి కంటైనర్లు యథేచ్ఛగా పలు రహదారులపై పరుగులు పెడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కుతున్న వీటిపై పోలీసులు, రెవెన్యూ, రవాణా, మైనింగ్‌ శాఖల అధికారుల పర్యవేక్షణ కరువైంది.

వసతుల కల్పనపై నజర్‌

వసతుల కల్పనపై నజర్‌

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉచితంగా కాలేజీ బ్యాగులు, బ్రాండెడ్‌ షూస్‌, సాక్సులు అందించే కార్య క్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.

వీధి వ్యాపారులకు వెన్నుదన్నుగా..

వీధి వ్యాపారులకు వెన్నుదన్నుగా..

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి(ఆత్మనిర్భర్‌ నిధి) ద్వారా అందిస్తున్న రుణాలు వీధి వ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. 2020 జూన్‌ మాసంలో ప్రారంభమైన స్వనిధి పథకం ప్రక్రియ మధ్యలో నిలిచిపోవడంతో స్ట్రీట్‌ వెండర్లు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ గత సంవత్సరం నవంబర్‌లో రుణాల పంపిణీ పునరుద్ధరించడంతో పాటు ఎలాంటి హామీలు, షూరిటీలు లేకుండానే కేవలం నిమిషాల వ్యవధిలోనే రుణాలను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో అందించడానికి వీధి వ్యాపారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 పంటల బీమా అమలెప్పుడు...?

పంటల బీమా అమలెప్పుడు...?

రాష్ట్రంలో ఆరేళ్ల క్రితం నిలిచిపోయిన పంటల బీమా పథకాన్ని పునరుద్ధ రిస్తామని ప్రకటించిన అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండేళ్లు గడుస్తున్నా కూడా పథకం అమలు గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2026-27 బడ్జెట్‌లో పంటల బీమా పథకం అమలు చేసేందుకు 1896 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, అది కాగితాలకే పరిమితం అవుతు న్నట్లు కనబడుతున్నది.

యువత భవిష్యత్తుతో   చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్‌

యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్‌

ఎన్నికల సమయంలో విద్యా ర్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపిం చారు.

ఉపాధ్యాయుల మాట బంగారు బాట

ఉపాధ్యాయుల మాట బంగారు బాట

విద్యార్థులు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. నేటి విద్యార్థులే రేపటి ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

 విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి

విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి

వ్యక్తులపై కాకుండా వ్యవస్థ ఆధారంగా పనిచేసేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి, అవార్డులు అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి