కార్పొరేషన్‌లో ఖాళీలను భర్తీ చేయాలి
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:11 PM
రామగుండం నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీపీఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య, ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు గోషిక మోహన్ డిమాండ్ చేశారు. ఆదివారం భాస్కర్‌రావు భవన్‌లో సీపీఐ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
కోల్‌సిటీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీపీఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య, ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు గోషిక మోహన్ డిమాండ్ చేశారు. ఆదివారం భాస్కర్‌రావు భవన్‌లో సీపీఐ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్‌లోని శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో 144పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎస్‌ఈ, ఈఈ పోస్టులను భర్తీ చేయలేదని, డీఈ, ఏఈలను కూడా పూర్తి స్థాయిలో నియమించలేద న్నారు. డివిజన్లలో పనులకు అంచనాలు రూపొందించడానికి ఏఈలు అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నారు. పారిశుధ్య విభాగంలో కేవ లం ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉండడం వల్ల పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంద న్నారు. ఏసీపీ, టీపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఒకరే టీపీఎస్ ఉండడం వల్ల ఇష్టానుసారంగా అవినీతి పేరుకుపోయిందన్నారు. కార్పొరే షన్‌లో మాస్టర్ ప్లాన్ అమలు చేశాకే రోడ్ల విస్తరణ చేయాలని డిమాండ్ చేశారు. ఓదమ్మ, ఆసాలమ్మ, శనిగరపు చంద్రశేఖర్, సిరిసిల్ల మల్లేష్, రానవేన సుధీర్ కుమార్ పాల్గొన్నట్టు ఆయన తెలిపారు.