రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:14 PM
పెద్దపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డు విస్తరణకు మున్సిపల్ పాలకవర్గం సిద్ధమైంది. పెరిగిన జనాభా దృష్యా రోడ్డు విస్తరణకు నిర్ణయించి నిధులు కేటాయించారు. అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా విస్తరణ కొంత తగ్గించాలని పలువురు వ్యాపారులు మున్సిపల్ చైర్మన్‌ను కోరారు.
పెద్దపల్లి టౌన్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డు విస్తరణకు మున్సిపల్ పాలకవర్గం సిద్ధమైంది. పెరిగిన జనాభా దృష్యా రోడ్డు విస్తరణకు నిర్ణయించి నిధులు కేటాయించారు. అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా విస్తరణ కొంత తగ్గించాలని పలువురు వ్యాపారులు మున్సిపల్ చైర్మన్‌ను కోరారు. ఎమ్మెల్యే విజయరమణారావుతో పలుమార్లు సమావేశమయ్యారు. మాస్టర్ ప్లాన్ ప్రకా రం చేయాల్సిన రోడ్డు విస్త్తరణను తగ్గించారు. అయి నప్పటికీ కొందరు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. మరి కొందరు స్వచ్ఛందంగా తొలగించుకు నేందుకు ముందుకు వస్తున్నారు. మున్సిపల్ పాలకవ ర్గం శనివారం దుకాణ యజమానులకు పరిస్థితి వివరించి నోటీసులు అందించారు.
పెద్దపల్లి పట్టణంలో మజీద్ నుంచి అయ్యప్ప టెంపుల్, కునారం, కమాన్ రోడ్డు, సాగర్‌రోడ్డు, సుభాష్‌నగర్, మిషన్ హైస్కూల్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పటికి ఎవరికీ ఇబ్బందులు కలగ లేదు. మెయిన్ రోడ్డు విస్తరణ పనులతో వ్యాపార వాణిజ్య సంస్థలకు ఇబ్బందులు కలుగనుంది. ఎదరె దురుగా వాహనాలు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉం టోంది. పండుగల సమయాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. కేవలం నడిచి వెళ్ళే వారికి అవకాశం కల్పిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగ మించేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావులు చొరవ చూపారు. జెండా చౌరస్తా నుంచి పెద్ద మజీద్ వరకు ఉన్న మెయిన్ రోడ్డు 18 ఫీట్లను 80 ఫీట్లుగా మార్చేందుకు రూపకల్పన చేశారు. వ్యాపారుల విజ్ఞప్తి మేరకు 80 ఫీట్ల రోడ్డును 66 ఫీట్లు చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం మూడు కోట్ల రూపాయల నిధులు కేటా యించారు. అయితే 37 మంది హైకోర్టును ఆశ్ర యించగా మున్సిపల్ చట్టం ప్రకారం రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని సూచించింది. ఎమ్మెల్యేతో వ్యాపా రస్తులు, ఇంటి యజమానులు సమావేశంతో 55 ఫీట్లకు కుదించారు. 90 మంది ఇంటి యజమానులు. వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేశారు. శనివారం మున్సిపల్ చైర్మన్ నూగిళ్ళ మల్లయ్య, కమిషనర్ ఆకుల వెంకటేష్ సిబ్బందితో కలిసి ముందుగా మున్సి పల్ అద్దె భవనాలను కూల్చి వేశారు. అనంతరం రోడ్డుకు ఇరువైపుల ఉన్న షాపులకు వెళ్ళి తొలగించ కుంటే సోమవారం నుంచి మున్సిపల్ శాఖ తొలగిస్తుందని సూచించారు. 55 ఫీట్లకు ఇంచు కూడా దాటి రావద్దని సూచించారు.
ప్రజల సౌకర్యం కోసమే...
నూగిళ్ళ మల్లయ్య చైర్మన్
ప్రభుత్వం మెయిన్ రోడ్డు విస్తరణ 80 ఫీట్లు చేయాలని నిర్ణయించింది. పట్టణ వ్యాపారస్తుల దృష్ట్యా 55 ఫీట్లకు తగ్గించాం. అందరు సహకరించి స్వచ్ఛందంగా మార్కింగ్ ప్రకారం తొలగించి పట్టణాభివృధ్ధికి తోడ్పడాలి. లేదంటే మున్సిపల్ తొలగిస్తుంది. విస్తరించకపోతే ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది