• Home » Peddapalli

Peddapalli

కోయకుండానే కంటతడి పెట్టిస్తున్న ఉల్లి..

కోయకుండానే కంటతడి పెట్టిస్తున్న ఉల్లి..

ఆకాశాన్నంటిన ఉల్లిగడ్డ ధరలు సామాన్యుడికి గుండెకోత మిగులుస్తున్నాయి. మొన్నటివరకు కిలో ముప్పై, నలభై రూపాయల మధ్య ఉన్న ఉల్లిగడ్డ, ఇప్పుడు ఏకంగా రూ.60 నుంచి 80 వరకు పలుకుతూ సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది.

కాంగ్రెస్‌ నాయకుల ఆందోళన

కాంగ్రెస్‌ నాయకుల ఆందోళన

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్‌ చేయాలని మంగళవారం గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ ఎస్‌సీ సెల్‌ అధ్యక్షుడు తాళ్లపల్లి యుగంధర్‌ ఆధ్వర్యంలో డప్పులతో ర్యాలీ నిర్వహించారు.

హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్‌

హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్‌

కాం గ్రెస్‌ ప్రభుత్వం హామీలను అమలు చేయకుం డా ప్రజలను మోసంచేసిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి విమర్శించారు. హామీల అమలు వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేం దుకు నిర్వహించిన పోరుబాట విజయవంతంగా ముగిసిందన్నారు.

వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

గణేష్‌ వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని, 25న నిర్వహించే గణేష్‌ నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు.

గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలి

గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలి

గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్ట రేట్‌లో పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు అవసరమైన మౌలిక వస తుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

సైబర్‌ నేరాల కట్టడిలో వారియర్స్‌ కీలక పాత్ర

సైబర్‌ నేరాల కట్టడిలో వారియర్స్‌ కీలక పాత్ర

సైబర్‌ నేరాల నుంచి ప్రజలను రక్షించడంలో సైబర్‌ వారియర్స్‌ పాత్ర కీలకమని, నేరాలు జరిగినప్పుడు వారియర్స్‌ వెంటనే స్పందించేలా నైపుణ్యాలను పెంచుకోవాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. సోమవారం కమిషనరేట్‌లో సైబర్‌ నేరాలపై సైబర్‌ వారియర్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను అమలుచేయాలి

కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను అమలుచేయాలి

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం తహసీల్దార్‌ కార్యా లయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

అర్హత ఉన్న వారికే ’ఆసరా...’

అర్హత ఉన్న వారికే ’ఆసరా...’

ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అర్హులైన వారినే ఎంపిక చేసేలా నిబంధన పెట్టింది. ఈ మేరకు గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక డిజెగ్నేటెడ్‌ వెరిఫైడ్‌ ఆఫీసర్‌(ధ్రువీకరణ అధికారులు) (డీవీవో)లను నియమించనున్నది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి దుర్మార్గం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి దుర్మార్గం

అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులపై పోలీసులు దురుసుగా వ్యవహరించ డం, దాడి చేయడం దుర్మార్గమని నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం

ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. హామీల అమలులో జాప్యం చేస్తే అన్ని జిల్లాల ఉద్యమకారు లను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చ రించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి