ఉపాధి అవకాశాలపై కార్యాచరణ చేపట్టాలి
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:38 PM
యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా అన్ని శాఖలు సమన్వ యంతో పని చేసి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన సమావేశంలో యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యా భివృద్ధి అంశాలపై సమీక్షించారు.
పెద్దపల్లి కల్చరల్, జూలై28(ఆంధ్రజ్యోతి): యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా అన్ని శాఖలు సమన్వ యంతో పని చేసి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన సమావేశంలో యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యా భివృద్ధి అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో సుమారు 7300 ఉద్యోగాల భర్తీ చేపట్టనున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన యువత అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించేలా కార్యాచరణ చేపట్టా లన్నారు. అధ్యాపకులు, శిక్షణా సామగ్రి, విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలు, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు తయా రు చేయాలన్నారు. వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపు ణ్యాభివృద్ధి కోర్సులను రూపొందించి శిక్షణ అందించాలన్నారు. గ్రామీణ యువతకు సమాచారం అందించేలా కార్యదర్శులను కూడా భాగస్వా మ్యం చేయాలన్నారు. ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు, ఐటీఐ, ఏటీసీ విద్యార్థు లను నియమించేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. జిల్లాలోని అన్ని నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు టామ్‌కామ్ ద్వారా జపాన్, జర్మనీ దేశాల్లో లభిస్తున్న ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించాలన్నారు. న్యాక్ అకాడమి అందిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి కోర్సులపై ప్రచారం నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ ఏఓ ప్రకాష్, సీపీఓ రవీందర్, జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, టాస్క్ మేనేజర్ కౌసల్య, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాఽధికారి కల్పన పాల్గొన్నారు.