అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:43 PM
వర్షాకాల సీజన్ దృష్ట్యా అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ మహంకాళి స్వామి సూచిం చారు. మంళవారం కార్పొరేషప్ కార్యాలయంలో నగర పాలక సంస్థ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావే శాన్ని నిర్వహించారు.
కోల్‌సిటీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): వర్షాకాల సీజన్ దృష్ట్యా అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ మహంకాళి స్వామి సూచిం చారు. మంళవారం కార్పొరేషప్ కార్యాలయంలో నగర పాలక సంస్థ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావే శాన్ని నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్‌లో మూడు నెలలుగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టా మని, డ్రైడే, ఫ్రైడే, ఫాగింగ్, యాంటీ లార్వా స్ర్పే, లీకే జీల మరమ్మతు, తాగునీటి క్లోరినేషన్, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టామన్నారు. కలుషిత మైన ఆహార పదార్థాల అమ్మకాలపై చర్యలు తీసుకు న్నట్టు చెప్పారు. ప్రభుత్వాసుపత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో ఔషధాలు, ల్యాబ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని, జ్వరాల సర్వేల తోపాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కమి షనర్ అరుణశ్రీ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఆర్‌ఎంఓ కృపాభాయి, వైద్యులు మాణికేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ సంపత్‌కుమార్, ఏసీపీ శ్రీహ రి, డీఈ శాంతి స్వరూప్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అభివృద్ధి
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు మేయర్ మహంకాళి స్వామి చెప్పారు. మంగళవారం 35వ డివిజన్ సప్తగిరికాలనీ, రాజలక్ష్మి కాలనీ, రాజీవ్‌నగర్‌లలో నాలా పూడికతీత పనులు, పిచ్చిమొక్కల తొలగింపు పనులను చేపట్టారు. మెడికల్ కళాశాలకు వచ్చేరోడ్డు కోతకు గురవుతుందని, రోడ్డు నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదే శాలు జారీచేశారు. కార్పొరేటర్ జంగపల్లి రమాదేవి శ్రీనివాస్, డీఈ శ్రీకాంత్, టీపీఓ నవీన్, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, శ్రావణి పాల్గొన్నారు.