జల సంరక్షణ మన సంరక్షణ
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:01 AM
భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం జలసిరి కార్యక్ర మం చేపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని అన్నారు. సోమవారం వీవో అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. వర్షపు నీరు వృథా కాకుండా వ్యసాయానికి ఉపయోగప డేలా రైతులు పంట పొలాల్లో ఫాంపాండ్, ఊట కుంటలు ఏర్పాటు చేసు కోవాలన్నారు.
పెద్దపల్లి రూరల్, జూలై 27 ఆంద్రజ్యోతి): భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం జలసిరి కార్యక్ర మం చేపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని అన్నారు. సోమవారం వీవో అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. వర్షపు నీరు వృథా కాకుండా వ్యసాయానికి ఉపయోగప డేలా రైతులు పంట పొలాల్లో ఫాంపాండ్, ఊట కుంటలు ఏర్పాటు చేసు కోవాలన్నారు. ఇంటింటా ఇంకుడు గుంతలు, ప్రతీ ఊరికి చెక్‌డ్యామ్ అనే నినాదంతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీఎం ఏపీవో రమేష్ బాబు ఉన్నారు.
అంతర్గాం, జూలై27(ఆంధ్రజ్యోతి): ఇందిరా మండల సమాఖ్య మహిళలకు జలసిరిపై జడ్పీ సీఈఓ నరేందర్ సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామం నుంచి రైతులను గుర్తించి వారికి ఫాంపాండ్‌పై వివరించాలని, నిర్మించు కునేందుకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీలత, ఎం పీడీఓ తిరుపతి, మిషన్ భగీరథ ఏఈ సుకన్య, సెర్ప్ ఏపీఎం సదా నందం, ఈజీఎస్ ఏపీఓ రమేష్, పాల్గొన్నారు.
రామగిరి, (ఆంధ్రజ్యోతి): రత్నాపూర్ రైతువేదికలో జలసిరి పై సమన్వయ సమావేశం నిర్వ హించారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీలత అధ్యక్షతన నిర్వహించిన సమావే శానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఈవో సంజీవరావు హాజరయ్యారు. ఆయన మాట్లా డుతూ ప్రతీ ఇంట్లో ఇం కుడు గుంతలు ఏర్పాటు చేసు కోవాలని సూచించారు. ఎంపీడీవో శైలజరాణి, అదికారులు, సర్పంచ్‌లు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.