ఓటర్ మ్యాపింగ్ కోసం ప్రత్యేక డ్రైవ్
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:03 AM
ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి వందకు వంద శాతం పూర్తి చేయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అధికా రులకు సూచించారు. సోమవారం సుల్తానాబాద్ మండల పరిషత్ సమా వేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సుల్తానాబాద్, జూలై 27 ఆంద్రజ్యోతి): ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి వందకు వంద శాతం పూర్తి చేయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అధికా రులకు సూచించారు. సోమవారం సుల్తానాబాద్ మండల పరిషత్ సమా వేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతు సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు ఎనభై శాతం వరకు ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేశారని, అధికారులు, బీఎల్‌ఓలు, సిబ్బంది, కౌన్సిలర్లు సమిష్టిగా కృషి చేసి నిర్ణీత లక్ష్యాన్ని అదిగమించాలని అన్నారు. అధికారులు బీఎల్‌ఓ తదితర సిబ్బంది ఈ నెల 28 నుంచి ఇంటింటికి వెళ్ళి మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ, వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్ఫలత, తహసీల్దార్ బషీరొద్దన్, మున్సిపల్ కమిష నర్ రమేష్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కలిసికట్టుగా సర్‌పై దృష్టి సారించాలి
పెద్దపల్లి టౌన్, జూలై 27 (ఆంఽధ్రజ్యోతి) కలిసికట్టుగా సర్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని విప్ ఎమ్మెల్యే విజయరమణారావు సంబంధిత సిబ్బందికి సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నూగిల్ల మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని 36 వార్డుల్లో కౌన్సిలర్, వార్డు ఆఫీసర్, బూత్ లేవల్ ఆఫీసర్లు ప్రతీ ఒక్కరి ఓటు నమోదు చేయాలని సూచించారు. అనంతరం జెండా చౌరస్తా నుంచి మసీద్ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు చేస్తున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కమిషనర్ ఆకుల వెంకటేష్, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.