ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:00 AM
సూపర్ ఎల్‌ని నో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెల కొన్న నేపథ్యంలో వరి సాగుకు బదులుగా ప్రత్యా మ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికా రులను ఆదేశించారు.
పెద్దపల్లి, జూలె 27 (ఆంధ్రజ్యోతి): సూపర్ ఎల్‌ని నో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెల కొన్న నేపథ్యంలో వరి సాగుకు బదులుగా ప్రత్యా మ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికా రులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం నీటి లభ్యత పరిమితంగా ఉన్నందున రైతులను వరి సాగుకు బదులు కందులు, పెసర, మినుములు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆయిల్‌పామ్ సాగు చేప ట్టాలని సూచించారు. పొలాలను బీడుగా ఉంచకుండా పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే రైతులకు ఆదాయం లభించడంతోపాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతాయన్నారు. వచ్చే పది రోజులను ప్రత్యేక కార్యాచరణగా తీసుకుని గ్రామాల వారీగా రైతులను చైతన్య పరచాలని, రోజూ ఎంతమంది రైతులు పంట మార్పిడికి ముందుకొ చ్చారనే వివరాలను నివేదికల రూపంలో అందించా లని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఒంటరి మహిళా రైతులు, చిన్న, సన్నకారు రైతులకు ఆయి ల్‌పామ్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుకు అదనపు ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఖరీఫ్‌లో నిర్దేశించిన 2.72 లక్షల ఎకరాల సాగు లక్ష్ష్యాన్ని తప్పని సరిగా సాధించాలని, భూ ములను ఖాళీగా ఉంచితే రైతుభరోసా వంటి ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉం దని హెచ్చరించారు. భూగర్భ జలాల పెంపు కోసం ఫామ్‌పాండ్ల నిర్మా ణాన్ని వేగవంతం చేయాలని, వాటి నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులను 15 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్, వ్యవసాయ శాఖ ఏడీఏ కాంతారావు, ఏఈవో పాల్గొన్నారు.