Share News

రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Jul 27 , 2026 | 11:58 PM

రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

పెద్దపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎరువుల కొరతను ఆసరాగా చేసుకుని ప్రైవేట్‌ వ్యాపారులు యూరియా, డీఏపీ, తదితర ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. యూరియా కోసం వచ్చే రైతులకు ఇతర ఎరువులను బలవంతంగా కొనిపిస్తున్నారని, దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి మోటార్లను వెంటనే ప్రారంభించి సాగునీరు విడుదల చేయాలని కోరారు. అప్రకటిత విద్యుత్‌ కోతలతో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని, రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. నియోజక వర్గంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులకు బర్దాన్‌ సంచుల బకాయిలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ధర్నాలో నాయకులు వంగళ తిరుపతిరెడ్డి, నూనేటి సంపత్‌, మోహన్‌రావు, సందీప్‌ రావు, మార్కు లక్ష్మణ్‌, బైరం రామ్‌రెడ్డి, రాజమల్లు, గణపతి, కొయ్యడ సతీష్‌ గౌడ్‌, సలేంద్ర రాములు, విన్నం రవీందర్‌, పెంచాల శ్రీధర్‌, పూదరి చంద్రశేఖర్‌, స్వామి విక్రమ్‌ గౌడ్‌, బాబురావు, శ్రీనివాస్‌, పడాల సతీష్‌ గౌడ్‌, తీగల సదయ్య, చీకటి పోచాలు, ముత్యాల రాజయ్య, రామ్‌రెడ్డి, సర్పంచులు గొడుగుల సతీష్‌, చొప్పరి ఆంజనేయులు, కొండల్‌ రాజు, శ్రీకాంత్‌, శ్వేతా వెంకటేష్‌, ఆకుల శ్రీనివాస్‌ గౌడ్‌, మెడగోని శ్రీకాంత్‌, దేవయ్య, నూనేటి కుమార్‌ యాదవ్‌, లవన్‌, బాలసాని శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2026 | 11:58 PM