Share News

విద్యార్థుల పోరాటానికి తొలి విజయం

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:16 PM

నీట్‌ యూజీ-2026 పేపర్‌ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి తొలి విజయమని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు అన్నారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో విజయోత్సవాలు నిర్వహించారు.

విద్యార్థుల పోరాటానికి తొలి విజయం

కోల్‌సిటీటౌన్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): నీట్‌ యూజీ-2026 పేపర్‌ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి తొలి విజయమని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు అన్నారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో విజయోత్సవాలు నిర్వహించారు. నగర పాలక అధ్యక్షుడు బొంతల రాజేష్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉదయ్‌ రాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు అంబేద్కర్‌ చిత్రపటానికి, మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఉదయ్‌ రాజ్‌ మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఎన్‌ఎస్‌యూఐ దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరసనల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారన్నారు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనను స్వాగతించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గంగారపు ప్రవీణ్‌, సంధీ అక్షయ్‌, కేశవ, జీవన్‌, ఆకాష్‌, కార్తీక్‌, చరణ్‌, దినేష్‌, సుమంత్‌, అభిషేక్‌, సనిత్‌ కుమార్‌, ఈశ్వర్‌ రెడ్డి, రికీ, లింగస్వామి, ఓదెలు, ధీటీ బాలరాజు, కొప్పుల శంకర్‌, ముస్తఫా, గట్ల రమేష్‌, తిప్పారపు శ్రీనివాస్‌, ఫజల్‌, దూళికట్ట సతీష్‌, పెద్దెల్లి ప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 11:16 PM