Home » Peddapalli
పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి మృతి కేసును పోలీసులు ఛేదించి, ఆమె గురువు జెట్టి నవీన్‌కుమార్‌ను నిందితుడిగా అరెస్టు చేశారు. విద్యార్థినిపై సింగరేణి ఓవర్‌మన్ రవికుమార్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలగా, ఆమెతో అతని సాన్నిహిత్యాన్ని ఓర్వలేక నవీన్‌కుమార్ ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కలెక్టరేట్ సమావేశ మం దిరంలో గురువారం యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అద నపు కలెక్టర్ బి. శ్రీరాములు, డిసిపి రాంరెడ్డి విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గురువారం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని అన్ని వర్గాల మతపెద్దలు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు.
మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపిస్తూ, వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మహిళా సాధికారత కేంద్రం పనితీరుపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
జిల్లాలో నిర్వహిస్తున్న సర్ విచారణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఽఅధికారులను అదేశించారు. పట్టణంలోని శ్రీవాణి కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ పరిశీలన కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.
కార్మికులకు సొంతింటి కల సహకారంపై అసెంబ్లీలో ప్రస్తావించాలని, రామగుండం ఎమ్మెల్యే సింగరేణి కార్మికుల సొంతింటిపై మాట్లాడడం అభినందనీయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు.
పెద్దపల్లి నియోజక వర్గం ఎలిగేడు మండలం రాములపల్లిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరుగుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠ శాలలో మంగళవారం విద్యార్థులకు అల్పాహారం అందించారు.
ఆది దేవుడు.. లంభోదరుడు.. గణపయ్య.. గణేషుడు... ఇలా అనేక పేర్లు తీరొక్క రూపాలతో భక్తకోటికి ఎదురయ్యే విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది.
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో గ్యాస్ వినియోగంపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. దీంతో ఇప్పటివరకు 45 రోజుల వ్యవధి ముగిసే వరకు ఎదురు చూడాల్సిన వినియోగదారులకు ఇక 25 రోజులకే మరో సిలిండర్ బుక్ చేసుకునే వెసలుబాటు కలిగింది.
ప్రభుత్వ పథకాలు గడప గడపకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం 47వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను మేయర్ ప్రజలకు వివరించారు.