• Home » Peddapalli

Peddapalli

ఎయిర్‌ పోర్టు  ఫ్రీ ఫిజిబులిటీ స్టడీకి నిధులు

ఎయిర్‌ పోర్టు ఫ్రీ ఫిజిబులిటీ స్టడీకి నిధులు

రామగుండం నియోజక వర్గంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్‌ నాయకుడు కామ విజయ్‌ ఆధ్వర్యంలో ఎంపీ వంశీకృష్ణ, మంత్రులు వివేక్‌, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచ కాల్చారు.

ఆత్మరక్షణకు కరాటే  దోహదం

ఆత్మరక్షణకు కరాటే దోహదం

కరాటే ఆత్మరక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుందని మం డల విద్యాధికారి జింక మల్లేషం అన్నారు. ఆదివారం గోదావరిఖని ఆర్‌సీఓఏ క్లబ్‌లో స్కూల్స్‌, గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు.

దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన

దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ పై దాడిని ఖండిస్తూ, కుల వివక్ష కారణంగా ఐపీఎస్‌ అధికారి పూరన్‌కుమార్‌ ఆత్మహత్యకు కారణ మైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌక్‌లో ఆదివారం నిరసన తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లకు ఉపాధిహామీ అనుసంధానం

ఇందిరమ్మ ఇండ్లకు ఉపాధిహామీ అనుసంధానం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం పనులు వేగవంతం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందు కోసం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో లబ్ధిదారుని కుటుంబాన్ని భాగస్వాములుగా చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉపాధిహామీ పథకం అనుసంధానం చేసింది.

పెద్దపల్లిలో ట్రాఫిక్‌ సిగ్నళ్ల ఏర్పాటు

పెద్దపల్లిలో ట్రాఫిక్‌ సిగ్నళ్ల ఏర్పాటు

పట్టణంలో పలు చోట్ల ట్రాఫిక్‌ సిగ్నళ్ళు శనివారం పోలీసులు ఏర్పాటు చేశారు. గతంలో అయ్యప్ప టెంపుల్‌, బస్టాండ్‌ వద్ద సిగ్నల్స్‌ మాత్రమే పని చేసేవి. జిల్లా కేంద్రం కావడంతో పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది.

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబం ధనలు పాటించాలని, ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాల కు చేర్చాలని ఎస్సై మధుకర్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఆటో స్టాండ్‌ వద్ద డ్రైవర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

అట్టహాసంగా జిల్లా స్థాయి చదరంగ పోటీలు

అట్టహాసంగా జిల్లా స్థాయి చదరంగ పోటీలు

పెద్దపల్లి జిల్లా స్థాయి చద రంగ పోటీలు ఎలిగేడు మండల కేంద్రంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 69వ ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి అండర్‌ 14, 17 బాలబాలికల చదరంగ పోటీలు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.

బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు

బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు

బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రిజర్వేషన్‌ బిల్లును అసెంబ్లీలో తీర్మాణానికి బీజేపీతో పాటు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు.

కాంగ్రెస్‌ను నమ్మితే బీసీలను నట్టేట ముంచారు

కాంగ్రెస్‌ను నమ్మితే బీసీలను నట్టేట ముంచారు

కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను నట్టేట ముంచిందని, కాంగ్రెస్‌ పార్టీ నయవంచన అని మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాడు అధికారం కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్‌, నేడు నమ్మించి మోసం చేసిందన్నారు.

భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసే నిర్ణయాలను ప్రభుత్వం విరమించుకోవాలని, సంక్షేమ బోర్డును ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పజెప్పడాన్ని నిలిపి వేయాలని, సంక్షేమ పథకాలను నేరుగా ప్రభుత్వమే కార్మిక వర్గానికి అందజేయాలని ఐఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి