Share News

మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:24 AM

జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకో వాలని అదనపు కలెక్టర్‌ డి.వేణు అధికారు లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ లో మాదకద్రవ్యాల, డ్రగ్స్‌ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్‌ కంట్రోల్‌ సమావేశాన్ని నిర్వహిం చారు.

మాదకద్రవ్యాల నియంత్రణకు  చర్యలు

పెద్దపల్లిటౌన్‌, డిసెంబరు 23 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకో వాలని అదనపు కలెక్టర్‌ డి.వేణు అధికారు లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ లో మాదకద్రవ్యాల, డ్రగ్స్‌ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్‌ కంట్రోల్‌ సమావేశాన్ని నిర్వహిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుం దని, ఆలోచనా విధానం, శక్తి నశిస్తాయ న్నారు. యువత మాదక ద్రవ్యాలపై ఆకర్షి తులు కాకుండా సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని పేర్కొన్నారు.

జిల్లాలోని రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు, హాస్టల్స్‌లలో విద్యార్థుల అలవాట్లను పర్యవేక్షించాలని, విద్యా సంస్థల పరిసర ప్రాంతాలలో మత్తు పదార్థాలు రాకుండా చూసుకోవాలన్నారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్‌, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలని సూచించారు. మాదకద్రవ్యాల రవాణా, సాగు, విని యోగం నివారణకు పటిష్ట చర్యలు తీసు కోవాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్‌ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కని పిస్తే వెంటనే పోలీస్‌ అధికారులకు సమాచా రం అందించాలన్నారు. కలెక్టరేట్‌ పరిపాలన అధికారి బి.ప్రకాష్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మహిపాల్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 12:24 AM