ఉపాధిహామీ పేరు మార్చడం సరికాదు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:30 AM
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును జిరాంజీ ఉపాధి పథకంగా పేరు మార్చడం దుర్మార్గమని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. ఇం దుకు నిరసనగా సోమవారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చట్టం ప్రతులను దహనం చేశారు.
పెద్దపల్లిటౌన్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును జిరాంజీ ఉపాధి పథకంగా పేరు మార్చడం దుర్మార్గమని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. ఇం దుకు నిరసనగా సోమవారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చట్టం ప్రతులను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ వామపక్ష ప్రతినిధులు యూపీఏ గవర్నమెంట్‌లో మంత్రులుగా ఉన్న సమయంలో జాతీయ ఉపాధిహామీ చట్టం ద్వారా పేద కార్మికులకు పని కల్పించాలనే సంక ల్పంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టార న్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేరు మార్చి మత రాజకీయాలు చేస్తున్నదని, దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. మహాత్మాగాంధీ పేరు మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మార్కపురి సూర్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు కల్లేపల్లి నవీన్, శనిగరపు చంద్రశేఖర్, ఆరేపల్లి మానస్, రేణిగుంట్ల ప్రీతం, నాయకులు కళ్లెపెల్లి శంకర్, ఆజాద్, అబ్దుల్ కరీం పాల్గొన్నారు.