కూల్చివేతలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ధర్నా
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:31 AM
గోదావరిఖనిలో కూల్చి వేతలను నిరసిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
గోదావరిఖని, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): గోదావరిఖనిలో కూల్చి వేతలను నిరసిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూల్చివేతల్లో నష్ట పోయిన బాధితులకు పరిహారం చెల్లించాలని, రెండు సంవత్సరాలుగా పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివే తలు తప్ప అభివృద్ధి జరగడం లేదన్నారు. రోడ్ల విస్తరణ పేరుతో దుకాణాలను కూల్చుతూ ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా బజారున పడవేస్తున్నారని, అభి వృద్ధి పేరిట కమీషన్ల కోసం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చౌరస్తా, గాంధీనగర్, లక్ష్మీనగర్, ఓల్డ్ అశోక్ టాకీస్ వద్ద కూల్చివేతలతో వ్యాపారాలు లేక కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. బజారున పడ్డ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం చౌరస్తాలో కూల్చివేతకు గురైన మల్లేష్‌ను పరామర్శించారు. ధర్నా చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ధర్నాలో నాయకులు కౌశిక హరి, గోపు ఐలయ్య, లత, పాముకుంట్ల భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, జనగామ కవిత, బాదె అంజలి, మారుతి, దేవరాజు, వాసు, కోడి రామకృష్ణ, జక్కుల తిరుపతి, నీరటి శ్రీనివాస్ పాల్గొన్నారు.