Home » Peddapalli
అభివృద్ధి పనులతో రామగుండానికి కొత్త రూపు సంతరించుకుందని ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్ పేర్కొన్నారు. శనివారం నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో రూ.5.73కోట్ల నిధులతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు.
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల అన్నారు. శనివారం పెద్ద బొంకూరు మదర్‌థెరిస్సా ఇంజనీ రింగ్ కళాశాలలో న్యాయ సేవాధి కార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో శనివారం ఆర్జీ-2 జీఎం బండి వెంకటయ్య స్ట్రక్చర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఏరియాలో పలు సమస్యలను ఏఐటీయూసీ నాయకులు జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఓసీపీ-3లోని సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఖాళీలను వీకేపీ గని నుంచి సీనియార్టీ ప్రాతిపదికన భర్తీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
సుల్తానాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని నిర్వహిస్తున్న డంప్‌యార్డులో చెత్త చేరుకుపోయింది. ప్రాసె సింగ్ లేకపోవడంతో హైదరాబాద్‌లోని సీడీఎంఏకు ఫిర్యాదులు రావడంతో శుక్రవారం సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ సంధ్య డంప్‌యార్డును ఆకస్మి కంగా తనిఖీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేపడుతున్నది. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని పలువురు రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు.
బీసీ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని పెగడపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి సభలో పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ ప్రకటించిందన్నారు.
సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెసుసిటేషన్) పై అందరికి అవగాహన ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వి. వాణిశ్రీ తెలిపారు. కలెక్టరెట్లో శుక్రవారం అవగా హన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డా. ప్ర శాంత్ సీపీఆర్ చేసే విధానాన్ని వివరించారు. అనంతరం పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయిం చారు.
రాహుల్‌గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానున్నదని ఏఐసీసీ పరిశీలకులు, తమిళనాడు మాజీ ఎంపీ జై కుమార్ అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, జిల్లాలో బలోపేతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆరు గ్యారంటీల తరహాలోనే 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతూ తెలంగాణ బీసీ బిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గురువారం హైదరాబాదు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ అధికారం కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్, నేడు నమ్మించి మోసం చేసిందన్నారు.
నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు సంబంధించి భూ సేకరణ సమస్యలను ఈనెల 24లోపు పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయాల్లో పలు అభివృద్ధి పనుల పై వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు.