Share News

‘ఉపాధిహామీ’లో గాంధీ పేరు తొలగింపుపై నిరసన

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:43 PM

జాతీయ ఉపాధిహామీ పథ కం పేరు మారుస్తూ ఎన్‌డీఏ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివా రం గోదావరిఖని గాంధీ చౌరస్తాలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఉదయ్‌రాజ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘ఉపాధిహామీ’లో గాంధీ పేరు తొలగింపుపై నిరసన

కళ్యాణ్‌నగర్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధిహామీ పథ కం పేరు మారుస్తూ ఎన్‌డీఏ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివా రం గోదావరిఖని గాంధీ చౌరస్తాలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఉదయ్‌రాజ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్‌ నగర అధ్య క్షుడు బొంతల రాజేష్‌, కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్‌ మాట్లాడుతూ బ్రిటీష్‌లను దేశం నుంచి వెళ్లగొట్టే వరకు అవిశ్రాంతంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అన్నారు.

మహాత్మాగాంధీని మతోన్మాద శక్తుల పేరుతో గాడ్సే హత్య చేయడం దేశం మరిచిపోలేనిదని, బీజేపీ నాయకత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో గాంధీ పేరును తొలగించడం కుట్రలో భాగమేనన్నారు. ఎన్‌డీఏ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతి రేకిస్తున్నారన్నారు. నాయకులు రవికుమార్‌, బొమ్మక రాజేష్‌, సుతారి లక్ష్మణ్‌బాబు, కొప్పుల శంకర్‌, చుక్కల శ్రీనివాస్‌, గడ్డం శ్రీనివాస్‌, దూళికట్ట సతీష్‌, ముస్తాఫా, గట్ల రమేష్‌, శోభ, స్వప్న, పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:43 PM