Home » Peddapalli
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళిత నాయకుడనే అవమానించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ అంబెద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
సుల్తానాబాద్ లో ఈనెల 17న రూ.250 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రుల చేతులమీదుగా శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పాల్గొని శంకుస్థాపనలు చేయ నున్నట్లు వివరించారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ యాకన్నకు వినతిపత్రం అందించారు.
నేత్రదానం, అవయవాల దానం కోసం ప్రజలు చైతన్యవంతులు కావాలని తహసీల్దార్ వనజ కోరారు. ప్రపంచ అవయవదాన దినోత్సవంలో భాగంగా గురువారం కస్తూర్బా కళాశాలలో సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.
నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పని చేస్తున్నానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు. గురువా రం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రధా ని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచం దర్ రావు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూని యర్ కళాశాల ఆవరణలో గురువారం నిర్వహిం చిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఆయన ప్రారం భించారు.
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లలో పారదర్శకత పాటిం చేలా విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో వసూలు చేసే ఫీజుల వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు అందుబాటులో ఉండేలా బహిరంగంగా ప్రదర్శించాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఇటీవల ఆదేశించారు.
రైతులు పామాయిల్ తోటల వైపు మొగ్గు చూపాలని ఉద్యా నవన శాఖ అధికారి రాము అన్నారు. శనివారం కాల్వ శ్రీరాంపూర్‌లో పుప్పాల విక్రమసింహారావుకు చెందిన ఆరు ఎకరాలలో మొక్కలను నాటారు.
ప్రభుత్వరంగ బొగ్గు పరిశ్రమల్లో పని చేస్తున్న బొగ్గుగని కార్మికులకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే 12 వేజ్‌బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న దేశ వ్యాప్తంగా అన్నీ బొగ్గు గనుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జాతీయ సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, తుమ్మల రాజిరెడ్డి, గడ్డం కృష్ణ చెప్పారు.
గోదావరిఖని ఎల్‌బీనగర్‌లోని నర్సింగ్ కళాశాల ప్రహరీ పక్కన నిర్మిస్తున్న షాపులను కూల్చివేయడంపై వివాదం ముదురుతోంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా గణపతి మండపంతోపాటు అక్కడ ఉపాధి పొందుతున్న కొందరు చిరు వ్యాపారులు నష్టపోతున్నారు.