Share News

కొండగట్టు అభివృద్ధికి చొరవ చూపడం అభినందనీయం

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:07 AM

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ టీటీడీ ద్వారా రూ.35.19 కోట్ల నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద స్థానిక హనుమాన్‌ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

కొండగట్టు అభివృద్ధికి చొరవ చూపడం అభినందనీయం

కమాన్‌పూర్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ టీటీడీ ద్వారా రూ.35.19 కోట్ల నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద స్థానిక హనుమాన్‌ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్‌ సేవాసమితి గౌరవ అధ్యక్షుడు చిర్రసత్యం, అధ్యక్షుడు సుద్దాల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు దేవునూరి చంద్ర మౌళి, సంఘం శ్రీనివాస్‌, శివసేన సమితి గౌరవ అధ్యక్షుడు పిన్నిరెడ్డి కిషన్‌ రెడ్డి, అధ్యక్షుడు గన్నవరపు రవి, మాజీ ఎంపీటీసీ పిల్లి శేఖర్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్‌, ఆటో యూనియన్‌ అధ్యక్షుడు మట్ట నర్సయ్య, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తాటిపెల్లి శ్రీనివాస్‌, అనవేన లక్ష్మిరాజంతోపాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 12:07 AM