బీటీ రోడ్డును నాణ్యతతో నిర్మించాలి
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:50 PM
మండలం లోని హన్మంతునిపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మల గద్దెల వరకు బీటీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణా లతో నిర్మించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.
పెద్దపల్లి రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మండలం లోని హన్మంతునిపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మల గద్దెల వరకు బీటీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణా లతో నిర్మించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. హన్మంతునిపేటలో సమ్మక్క సారలమ్మ జాతర కోసం కోటి రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో ఏర్పా టు చేసిన హాకా ఫార్మర్ సర్వీస్ సెంట ర్‌ను స్థానిక నాయకులతో కలిసి ప్రారం భించి అనంతరం యాజమాన్యానికి శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మ్యాడగోని శ్రీనివాస్‌గౌడ్, సం పత్‌రావు, కుమార్ గౌడ్,రాజయ్య, శ్రీనివాస్, సంపత్ పెద్దపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ మల్లారెడ్డి వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.