రైల్వే గేటు కష్టాలు తీరేదెప్పుడు?
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:43 PM
కునారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మూడేళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్వోబీకి ఇరువైపులా ఉన్న రోడ్డు నిర్మాణం కోసం సేకరించాల్సిన భూమి విషయంలో సయోధ్య కుదరకపోవ డంతో ఆర్‌అండ్ పనులు నిలిచిపోయాయి.
పెద్దపల్లిటౌన్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): కునారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మూడేళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్వోబీకి ఇరువైపులా ఉన్న రోడ్డు నిర్మాణం కోసం సేకరించాల్సిన భూమి విషయంలో సయోధ్య కుదరకపోవ డంతో ఆర్‌అండ్ పనులు నిలిచిపోయాయి. రైల్వే శాఖ పనులు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో ఆర్వోబీ ఎప్పుడు పూర్తవుతుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి కునారం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న రైల్వే గేట్ గం టల కొద్ది పడుతుండడంతో 2022 డిసెంబరులో ఆర్వోబీ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. 119 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారం భించిన నిర్మాణం మూడేళ్ళు అయినా పూర్తి కాలేదు. దీంతో నిర్మాణ అంచనా వ్యయం పెరిగి 199 కోట్ల రూపాయలకు పెరిగింది. ఆర్వోబీ నిర్మాణం ఇప్పటి వరకు 60 శాతం కూడా పూర్తి కాలేదు. దీంతో మరెంత కాలం బ్రిడ్జి నిర్మాణం సాగుతుందో అనే ఆందోళన ప్రయాణికుల్లో నెలకొంది. ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటు న్నారు.
పెద్దపల్లి నుంచి ప్రధాన రైల్వే లైన్ కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాజీ పేట, బల్లర్షా మధ్య రైళ్లు ఎక్కువగా నడుస్తుండ టంతో గేటు వేసిన ప్రతీ సారి గంటకు పైగా వాహనాలు నిలిచిపోతున్నాయి. గేటు తీసిన వెంటనే మరో రైలు కోసం గేటు వేస్తున్నారు. పూర్తి వాహనాలు వెళ్ళిపోక ముందే మళ్ళీ గేటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. వారం క్రితం ఇదే క్రమంలో ఓ కారు రెండు గేట్ల మధ్యలోనే ఇరుక్కుపోయింది. డ్రైవర్ వాహనాన్ని వదిలి వెళ్ళాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి ఆర్వోబీ నిర్మాణంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆర్వోబీతో తగ్గనున్న దూరం
పెద్దపల్లి, కునారం ఆర్వోబీ పూర్తయితే పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు మధ్య ఉన్న దూరభారం తగ్గిపోతుంది. పెద్దపల్లి మీదుగా కునారం రోడ్ నుంచి జమ్మికుంట, హుజురాబాద్, వరంగల్ వరకు ప్రయాణాలు సాగుతున్నాయి. అలాగే పెద్దపల్లి నుంచి కునారం, ముత్తారం మీదుగా భూపాలపల్లి జిల్లాకు రోడ్డు మార్గం ద్వారా వాహనాలు నడుస్తున్నాయి. అలాగే పెద్దపల్లి నుంచి ముత్తారం మీదుగా భూపాలపల్లికి ఫోర్‌లేన్ రోడ్డు మంజూరైంది. ఆ రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. అలాగే పెద్దపల్లి నుంచి కాల్వశ్రీరాంపూర్ మీదుగా, హుజురాబాద్ మీదుగా వరంగల్ వరకు ఫోర్‌లేన్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో పెద్దపల్లి, కునారం ఆర్వోబీకి ప్రాధాన్యం పెరిగిపోయింది. రోజు వేలాది వాహ నాలు ఈ మార్గాల నుంచి ప్రయాణం చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న రైల్వే గేట్ దాదాపు గంట సేపు వేస్తున్నారు. దీంతో వేలాది వాహనాలు నిలిచిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించాలన్నా, విద్యాసంస్థలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గేట్ తీసిన తర్వాత వాహనాలు ఒకేసారి పెద్దపల్లి పట్టణంలోకి ప్రవేశిస్తుండటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. వెంటనే ఆర్వోబీ నిర్మించి ప్రయాణికుల సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.