Share News

ఎమ్మెల్యేలతో సమన్వయ లోపం లేదు

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:45 PM

పెద్దపల్లి పార్లమెంట్‌ నియో జకవర్గ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలతో తనకెలాంటి విభేదాలు లేవని, రెండేళ్ల పదవీ కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4500కోట్లు మంజూరు చేయించానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎమ్మెల్యేలతో సమన్వయ లోపం లేదు

గోదావరిఖని, జనవరి 4(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పార్లమెంట్‌ నియో జకవర్గ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలతో తనకెలాంటి విభేదాలు లేవని, రెండేళ్ల పదవీ కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4500కోట్లు మంజూరు చేయించానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోడ్లు, రైల్‌, వాయుమార్గాల సౌకర్యాలపై దృష్టి పెట్టానన్నారు. పలు రైల్వే స్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్‌ కల్పించానన్నారు. 120కోట్లతో కుందనపల్లి వద్ద, రూ.80 కోట్లతో కన్నాల వద్ద ఆర్వోబీల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయ న్నారు. రామగుండం-మణుగూరు రైల్వే లైన్‌కు రూ.4వేల కోట్ల అంచనాల డీపీఆర్‌కు ఆమోదం లభించిందన్నారు. యూరియా విషయంలో కేంద్రం దిగుమతులపై ఆధారపడుతుందని, యేటా 40లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నా విదేశాలతో సత్సంబంధాలు లేకపోవడం వల్ల సకాలంలో యూరియా అందడం లేదన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో టెక్నాలజీల లోపాలు, కేంద్ర కార్యాలయం నోయిడాలో ఉండడం వల్ల ఉత్పత్తి ప్రభావం పడు తుందన్నారు. కేంద్ర కార్యాలయాన్ని రామగుండం తరలించాలని కేం ద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. రామగుండంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, టెం డర్‌ను కూడా నిలిపివేశారన్నారు. దీనిపై త్వరలోనే ఉన్నతాధికారులను కలుస్తానని, జిల్లా యంత్రాంగం సమన్వయం చేయలేక పోతుందన్నారు ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో 800మెగావాట్ల మూడు యూనిట్లు అనుమతులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. అం తర్గాంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై రీఫిజిబులిటీ సర్వే జరిగిందని, త్వర లోనే నివేదిక ఇవ్వనున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల విష యంలో రాజకీయ నిర్ణయాలకు ప్రాధాన్యతనిస్తుందని, తెలంగాణకు రావా ల్సిన సెమికండక్టర్‌ పరిశ్రమను ఆంధ్రకు తరలించుకుపోయారన్నారు. లింగాపూర్‌ లెదర్‌ పార్కు ఏర్పాటు, రామగుండం సిటీని బీ గ్రేడ్‌గా మార్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. బాబర్‌ సలీంపాషా, గుమ్మడి కుమారస్వామి, పీ మల్లికార్జున్‌, కామ విజయ్‌, రాచకొండ కోటేశ్వర్లు, మండ రమేష్‌, శ్యాంసుందర్‌, మధు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:45 PM