జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ ఖోఖో ఎంపిక పోటీలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:48 PM
జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిమ్మనపల్లిలోని పల్లవి పాఠశాలలో జిల్లాస్థాయి ఖోఖో ఎంపిక పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి, ఒలింపిక్ పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు.
పెద్దపల్లి రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిమ్మనపల్లిలోని పల్లవి పాఠశాలలో జిల్లాస్థాయి ఖోఖో ఎంపిక పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి, ఒలింపిక్ పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీడలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, క్రీడా రంగంలోనూ ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కన బరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలి పారు. రాష్ట్ర స్థాయిలో మంచి ప్రదర్శనతో జిల్లాకు పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. వివిధ పాఠశాలల నుంచి 250 మంది సబ్ జూనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు పల్లవి పాఠశాల కరస్పాండెంట్ శోభారాణి సహకారంతో భోజన వసతి కల్పించింది. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ కృష్ణయ్య, జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి వేల్పుల కుమార్, పేట అధ్యక్షుడు వేల్పుల సురేందర్, ప్రిన్సిపాల్ జరీనాఖాన్ హాజరయ్యారు. ఖో ఖో ఇండియా ప్లేయర్ గెల్లు మధుకర్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు షఫీ, సంధ్య, భాస్కర్, పాల్గొన్నారు.