Home » Peddapalli
పరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించవద్దని రైతులు బుధవారం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్నారు. పోతారం-కేశనపల్లి వద్ద జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అధికారులు సందర్శించిన క్రమంలో రైతులు అడ్డుకుని నష్టపరిహారం చెల్లించే వరకు పనులు ప్రారంభించేది లేదన్నారు.
ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్టు కార్మి కులు ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గేటు ఎదుట బైఠా యించి ప్ల కార్డులతో నిరసన తెలిపారు.
విద్యార్థుల ఫీజు బకా యిలను విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయాన్ని బీఆర్ఎస్వీ నాయకులు ముట్టడించారు.
పత్తి కొనుగోళ్లలో అక్ర మాలకు చెక్ పెట్టేందుకు సీసీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయా ధికారి భక్తి శ్రీనివాస్ అన్నారు.
పోలీసు అమరవీరుల అజరామరమని ప్రతీ ఒక్కరు వారి సేవలను స్మరించుకోవాలని డీసీపీ కరుణాకర్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి మండలాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కాటన్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని మార్కెట్ చైర్మన్ వైనాల రాజు, అదనపు కలెక్టర్ దాసరి వేణు, డీఎంఓ ప్రవీణ్‌రెడ్డి అన్నారు.
మహిళలు స్వయం ఉపాధిలో ముందుం డాలని విశ్వహిందు పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్ముళ్ల సత్యంజీ అన్నారు. మంగళ వారం శారదానగర్‌లోని విశ్వహిందు పరిషత్ భవన్లో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ప్రశంసాపత్రాలను అందజేశారు.
జిల్లాలో మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. 74 ఏ4 షాపులకు 1507 దరఖాస్తులు రాగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ డ్రా ద్వారా లైసెన్స్ దారులను ఎంపిక చేశారు. ఈ టెండర్లలో 15 మద్యం షాపులను మహిళలు దక్కించుకొన్నారు.
మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు సంఘటితంగా పోరాటం చేయాలని, భవి ష్యత్ తరాలకు డ్రగ్స్ మహమ్మారి నుంచి విముక్తి కలిగించాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి (డీఎల్ఎస్ఏ) స్వప్నారాణి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జిల్లా నశాముక్త్ భారత్ అభియాన్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించేలా ముగ్గుల పోటీలు నిర్వహించారు.
విద్యార్థు లకు పోలీసు శాఖ విధులపై అవగాహన కలిగి ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. సోమవారం కమిషనరేట్ కార్యాల యంలో పోలీస్ విధులపై ఓపెన్‌హౌస్ నిర్వహిం చారు.