Share News

జాతర పెండింగ్‌ పనులు సకాలంలో పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:06 AM

జిల్లాలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అధికారులను ఆదేశించారు.

జాతర పెండింగ్‌ పనులు సకాలంలో పూర్తి చేయాలి

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అధికారులను ఆదేశించారు. శుక్రవా రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రామగుండం గోదావరి నది, అంతర్గాం గోలివాడ, సుల్తానాబాద్‌ నీరుకుల్ల జాతర ఏర్పాట్ల పురోగతిపై తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జాతరకు సుమారు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉందని, వీటికి కావాల్సిన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో లైఫ్‌ జాకెట్లు, బోట్లు, గజఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జాతర నాలుగు రోజులు విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని, రెవె న్యూ డివిజన్‌ అధికారి సురేష్‌, ఏసీపీ గజ్జి కృష్ణ, కలెక్టరేట్‌ పాలన అధికారి ప్రకాష్‌, సి విభాగం పర్యవేక్షకులు కుమారస్వామి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:06 AM