Share News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:49 PM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం 13, 14, 32, 33వ వార్డుల్లో అర్హులైన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రొసీడింగ్‌ పత్రాలను అందజేశారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

పెద్దపల్లిటౌన్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం 13, 14, 32, 33వ వార్డుల్లో అర్హులైన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రొసీడింగ్‌ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతుందని, అలాగే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పట్టణంలో చాలా మేరకు సొంతిల్లు లేని పేద ప్రజలు ఉన్నారని వారికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు విడుతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ పేరిట పేదలను మోసం చేసిందని గుర్తు చేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అన్నారు. పెద్దపల్లి పట్టణంలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లా కేంద్రంలో బస్సు డిపో, బైపాస్‌ రోడ్డు, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, నూతన కోర్టు భవనం లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌, ఏఈ కొట్టె సదానందం, భూతగడ్డ సంపత్‌, ఎరుకల రమేష్‌, పాగాల శ్రీకాంత్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 11:49 PM