11న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ప్రారంభం
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:47 PM
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన 633 డబుల్ బెడ్‌రూమ్‌లను ఈ నెల 11న రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శుక్రవారం మంత్రుల పర్యటన ఏర్పాట్లపై పరిశీలించారు.
కోల్‌సిటీ, జనవరి 9(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన 633 డబుల్ బెడ్‌రూమ్‌లను ఈ నెల 11న రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శుక్రవారం మంత్రుల పర్యటన ఏర్పాట్లపై పరిశీలించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ప్రాంగణంలోని హెలీ ప్యాడ్ నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకు అవసరమైన ఏర్పాట్లను సూచించారు. జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు అవసరమైన సౌండ్ సిస్టం, స్టేజీ, తాగునీరు, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో అర్హులైన 479మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రొసీడింగ్‌లు అందజేస్తారన్నారు. 576మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. డివిజన్ల వారీగా లబ్ధిదారులకు సంబంధించి జాబి తాను సిద్ధం చేయడంతోపాటు వారికి అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ రమేష్, ఇతర అధికారులు ఉన్నారు.
సమ్మక్క - సారలమ్మ
జాతర పనుల పరిశీలన
గోదావరిఖని గోదావరి తీరంలో జరుగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర పనులను కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ పరిశీలించారు. జాతర పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖలు సమ న్వయంతో పని చేయాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన జాతర పనులు చేస్తున్నామని, ఇప్పటికే పనులు చాలా వరకు పూర్తి కావచ్చాయ న్నారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పార్కింగ్ సమస్య లేకుండా చూసుకోవాలని డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ రమేష్‌లను కలెక్టర్ ఆదేశించారు. జాతర పనుల గురించి సింగరేణి సివిల్ ఎస్‌ఈ వరప్రసాద్, రామగుండం నగర ఇన్‌చార్జి కమిషనర్ అరుణశ్రీ, ఈఈ రామన్‌లు కలెక్టర్‌కు వివరిం చారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఆర్‌డీఓ గంగయ్య, తహసీల్దార్ శ్రీపాద ఈశ్వర్, జాతర కమిటీ ప్రతినిధులు ఉన్నారు.