Home » Peddapalli
క్రీడలకు, వ్యాయామానికి రోజుకు ఒక గంట సమయం కేటాయించాలని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి సురేష్ పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తానాబాద్‌లో మూడు రోజుల క్రీడల నిర్వహణ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సింగరేణి సంస్థ సహకరించాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సింగ రేణి డైరెక్టర్(ఆపరేషన్స్) సూర్యనారా యణ, ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్, మేయర్ మహంకాళి స్వామితో సమా వేశం నిర్వహించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గురువార ం గోదావరిఖనిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా రాజేష్ థియేటర్ సర్కిల్ వద్ద నాయకులు నిరసన తెలిపారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల న్యాయమైన సమస్య లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ బొంకూరి శంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట గురువారం నిర్వహించిన మహాధర్నాలో ఆయ న మాట్లాడారు.
రామగుండం నియోజకవర్గ పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాజకీయ ముఖచిత్రాన్ని ప్రభావితం చేసే స్థాయిలో తగ్గిపోవడంతో నాయకుల్లో ఆందోళన మొదలైంది. 2023లో 2,13,000ఓట్లు ఉంటే ప్రస్తుతం 1,83,233 ఓట్లు మాత్రమే ఉన్నాయి.
ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి గృహ నిర్మాణ శాఖ పథకాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను రక్షించే బాధ్యతను అందరూ తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ప్రభుత్వ దవాఖానాలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలో అంగన్‌వాడి భవనంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంగళవారం ప్రారంభించారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సింగరేణి స్థలాల్లో నివాసాల క్రమబద్ధీకరణ కోసం ఆరేళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు 2019 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి స్థలాల్లోని భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో నెం.76 జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో సోమవారం నిర్వహించిన ఉద్యమ సన్నాహాక సమావేశంలో ఉద్యోగ, ఉపా ధ్యాయ, పెన్షనర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జేఏసీ చైర్మన్, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే మహాధర్నాకు ఉద్యోగులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.