భూముల రీ సర్వేకు 70 గ్రామాలు ఎంపిక
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:11 AM
భూముల రీ సర్వేకు జిల్లాలో ప్రభుత్వం70 గ్రామాలను ఎంపిక చేసినట్లు డీఆర్వో రాజేశ్వరి తెలిపారు. మంగళవారం మంగపేటలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ మండలంలో ఐదు గ్రామాలు ఎంపిక చేయగా, అందులో మంగపేటలో రీసర్వే చేయనున్నట్లు తెలిపారు.
కాల్వశ్రీరాంపూర్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వేకు జిల్లాలో ప్రభుత్వం70 గ్రామాలను ఎంపిక చేసినట్లు డీఆర్వో రాజేశ్వరి తెలిపారు. మంగళవారం మంగపేటలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ మండలంలో ఐదు గ్రామాలు ఎంపిక చేయగా, అందులో మంగపేటలో రీసర్వే చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేలో భాగంగా 2007 మార్చి నాటికి ప్రతీ భూమికి భూ ఆధార్ నెంబర్ కేటాయించాలనే లక్ష్యంతో డీజీపీఎస్ రోవర్లు, జీఐఎస్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దశల వారీగా సమగ్ర భూ పునఃసర్వేను నిర్వహిస్తున్నదన్నారు. మొదటి విడతలో 32 జిల్లాలోని 2240 గ్రామాల్లో సర్వే ఉంటుందన్నారు. భూ సర్వేకు సంబంధిత అధికా రులు వచ్చిన పక్షంలో రైతులు తమ పాస్‌బుక్కులు చూపించాలని, సర్వే సమయంలో గ్రామ సరిహద్దును గుర్తించి, ప్రభుత్వ స్థలాలు, ఆబాది భూమి మీద గ్రామకంఠం గుర్తిస్తారన్నారు. తహసీల్దార్ రాపెల్లి రాముడు, సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఉపసర్పంచ్ గూడెపు గోపాల్, ఆర్‌ఐ రాజేష్, సర్వేయర్ రాజు, వార్డుమెంబర్లు, రైతులు పాల్గొన్నారు.