Share News

జిల్లా మిల్లర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:06 AM

బియ్యం దిగుమతి విషయంలో అధికారుల వైఖరిని, ఎఫ్‌సీఐ తీరు ను నిరసిస్తూ మిల్లర్లు ఆందోళన చేశారు. మంగళవారం సుల్తానాబాద్‌ పట్టణంలోని రైల్వేస్టేషన్‌ పక్కన గల పెట్‌ గోదాం వద్ద రైస్‌మిల్లర్లు ధర్నా చేశారు. ఈ గోదాముకు ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యం లారీలను అడ్డుకు న్నారు.

జిల్లా మిల్లర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి

సుల్తానాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): బియ్యం దిగుమతి విషయంలో అధికారుల వైఖరిని, ఎఫ్‌సీఐ తీరు ను నిరసిస్తూ మిల్లర్లు ఆందోళన చేశారు. మంగళవారం సుల్తానాబాద్‌ పట్టణంలోని రైల్వేస్టేషన్‌ పక్కన గల పెట్‌ గోదాం వద్ద రైస్‌మిల్లర్లు ధర్నా చేశారు. ఈ గోదాముకు ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యం లారీలను అడ్డుకు న్నారు. జిల్లా రైస్‌మిల్లులో బియ్యం నిలువలు ములు గుతున్నాయని, గోదాముల్లో స్థలాలు లేక దిగుమతికి అనుమతి ఇవ్వకపోవడంతో ఆవేదనకు గురవుతున్నా మని తెలిపారు. జిల్లాలోని రైస్‌మిల్లర్ల సంఘాల ఆధ్వ ర్యంలో అన్ని గోదాముల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైస్‌మిల్లుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోరపెళ్లి తిరుపతి రెడ్డి, నగునూరి అశోక్‌, విజయపాల్‌ రెడ్డి మాట్లాడుతూ మిల్లర్లపై జిల్లా యంత్రాంగం ఎఫ్‌సీ ఐ అధికారులు వివక్ష చూపుతున్నారన్నారు. సాంకేతిక కారణాలు చూపుతూ జిల్లా మిల్లర్లకు అవకాశాలు ఇవ్వ కుండా ఇతర జిల్లాల వారికి బియ్యం దిగుమతి చేసుకు నేందుకు అవకాశాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ద్వారా ఈ సీజన్‌కు నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు పొందారని, అందుకు సంబం ధించిన బియ్యాన్ని డెలివరీ చేస్తామని సిద్ధంగా ఉంటే తమకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లా పేరుతో జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ నుంచి దిగుమ తులకు అనుమతిస్తున్నారని, దీంతో తాము సకాలంలో ప్రభుత్వానికి బియ్యం డెలివరీ చేయలేక డిఫాల్టర్లుగా ప్రమాదం ఏర్పడుతుందన్నారు. జిల్లాలో 140 రైసుమి ల్లులు ఉండగా మిల్లులో బియ్యం నిల్వలు డెలివరీ సిద్ధం గా ఉన్నాయని, అధికారులు సుల్తానాబాద్‌, పెద్దపెల్లి గోదాములలో దిగుమతికి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. గోదాములలో స్థల సమస్య ఏర్పడిందని, బియ్యం డెలివరీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కలెక్టర్‌దృష్టికి తీసుకువచ్చామని, ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, ఇతర జిల్లాలకు సంబంధించిన బియ్యం దిగుమతులను అడ్డుకుంటామని హెచ్చరిం చారు. నాయకులు ముత్యాల రాజన్న, కట్కూరి రాజేశం, వెంగళరావు, మాడూరి ప్రసాద్‌, దుగ్యాల సంతోష్‌ రావు, ఐత రమేష్‌, చకిలం సత్తన్న, మారుతి, వాసు, అల్లంకి శీను పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 12:06 AM