గ్రామాల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:08 AM
జిల్లాలో డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
పెద్దపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. మంగళవా రం కలెక్టరేట్‌లో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రొజెక్టర్ ద్వారా వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, భవనాలు, మౌలిక వసతుల కల్పనలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే గుర్తించి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి కొరత ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. అంగన్‌వాడీ భవనాల మరమ్మతు పనులను యుద్ధప్రా తిపదికన పూర్తి చేసి చిన్నారులకు సురక్షితమైన, మెరుగైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత విషయంలో రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈఈ శంకరయ్య అధికారులు పాల్గొన్నారు.