Home » Peddapalli
కేంద్ర ప్రభుత్వం కరీంనగర్-జగిత్యాల రోడ్డును జాతీయరహదారిగా-563గా ప్రకటించింది. ఈ రోడ్డును నాలుగులైన్లతో విస్తరించేందుకు ఏడేళ్ల క్రితమే 2,227 కోట్ల రూపాయలు కేటాయించింది.
యాసంగి పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నా చెరువులు, కుంటలు ప్రాజెక్ట్‌లలో సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో దానికి అనుగుణంగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో కీలకమైన హెచ్‌టీఆర్ వైఫల్యంపై కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్రం రూ.6వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పరిశ్రమలో టెక్నాలజీ వైఫల్యంతో ఈ ఏడాది సుమారు 4నెలల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది.
సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆర్‌జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
మతిస్థిమితం లేక ఇంటిని, ఊరును, కన్నవారిని వదిలివెళ్లిన వ్యక్తి 12 సంవత్సరాల అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాడు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పట్టెం వెంటకరాములు 25 ఏళ్ల వయసులో మానసిక స్థితి సరిగా లేకపోవ డంతో గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు.
రామగుండం కార్పొరేషన్‌లో దారి మైసమ్మ, ఏల్పుమ్మ విగ్రహాల ప్రతిష్టాపనను శనివారం కాంగ్రెస్ నాయకులు మహంకాళిస్వామి, కాల్వ లింగస్వామి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని ఆటో అడ్డా వద్ద ఒజ్జల వెంకన్నశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గణపతి హోమం నిర్వహిం చారు.
పెద్దపల్లి-కునారం రోడ్డు లోని రైల్వే ఫ్టైవోవర్ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేసి సర్వీస్‌రోడ్డు పనులు చేపట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ గేటు పడితే కాల్వశ్రీరాంపూర్ మార్గంలో వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు.
ఓ వ్యక్తి బట్ట తలపై కోతి కూర్చున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెట్టు కింద సేద తీరుతున్న వ్యక్తి తలపై ఉన్నట్టుండి కోతి వచ్చి కూర్చుంది.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని మాతాశిశు కేంద్రంలో మెరుగైన వైద్యసేవలందించిన సిబ్బందిని సన్మానించి, జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఐదు దశాబ్దాలుగా దేశానికి వెలుగులను అందిస్తూ ప్రపంచ అగ్రగామి సంస్థగా ఎన్టీపీసీ వెలుగొందుతోందని రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.