Share News

సమస్యల పరిష్కారానికే విద్యుత్‌ సదస్సులు

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:58 PM

విద్యుత్‌ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికే విద్యుత్‌ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మన్‌ వేణుగోపాలచారి అన్నారు.

సమస్యల పరిష్కారానికే విద్యుత్‌ సదస్సులు

ఎలిగేడు, జనవరి21(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికే విద్యుత్‌ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మన్‌ వేణుగోపాలచారి అన్నారు. బుధవారం ఎలి గేడు సబ్‌స్టేషన్‌ ఆవరణలో కాట్నపల్లి, సుల్తానాబాద్‌, కనుకుల, ఎలిగేడు, సబ్‌స్టేషన్‌ల పరిధిలోని వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేరుగా ఫిర్యాదులు తీసుకొని పరి ష్కారానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

సమస్యలను నిర్దేశించిన సమయంలో పరిష్కరించకపోతే తగిన ఆధారాలతో వినియోగదారుల ఫోరం దృష్టికి తెలపాలని సూచించారు. ప్రతినెల అవసరం మేరకు ఆయా ప్రాంతాల్లో ఐదు లోకల్‌ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమస్యలపై వినియోగదారులు వాట్సప్‌ పోస్ట్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే పరి ష్కరించేలా చూస్తామన్నారు. వినియోగదారులు, రైతులు పలు సమస్యలను ఫోరం దృష్టికి తీసుకువచ్చారు. టెక్నీకల్‌ సీజీఆర్‌ఎఫ్‌ రమేష్‌, ఫైనాన్స్‌ సీజీఆర్‌ఎఫ్‌ దేవెందర్‌, ఇండిపెండెంట్‌ సభ్యుడు రామారావు, పెద్దపల్లి డీఈ రాజాబ్రహ్మచారి, ఎస్‌ఏఓ శ్రీనివాస్‌, సుల్తానాబాద్‌ ఏడీ రామస్వామి, ఏఈలు సంపత్‌రెడ్డి, సఫియోద్దిన్‌, కిషోర్‌, దామోదర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 11:58 PM