ఎంసీహెచ్‌లో మెరుగైన సేవలు అందించాలి
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:59 PM
ఎంసీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.
పెద్దపల్లిటౌన్, జనవరి 21 (ఆంఽధ్రజ్యోతి) ఎంసీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. హెల్ఫ్ డెస్క్ స్కానింగ్ రూమ్, చిన్న పిల్లల వార్డు, ఆప్తామాలజిస్ట్ ఓపి వార్డ్ ఫార్మసి, ఆర్థో, జనరల్ వార్డులను, డయాగ్నోస్టిక్ హబ్, బ్లడ్‌బ్యాంక్‌లను పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ ఫార్మసీ స్టోర్‌లో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని తెలిపారు. ల్యాబ్‌లో రక్త పరీ క్షల నిర్వహణకు పరికరాలు అవసరం ఉంటే వివరాలు అందించాలన్నారు. గర్భిణీలకు, పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, పి.ఓ.డాక్టర్ వాణిశ్రీ, ఆర్‌ఎంఓ డాక్టర్ విజయ్, జనరల్ సర్జన్ డాక్టర్ సాయి ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.