Share News

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:03 AM

జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించా లని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. బుధవా రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు.

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించా లని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. బుధవా రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు 7,965 మంది ఉన్నారని, వారికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇంటర్‌ థియరీ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహ ణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల గదుల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్‌, అవసరం మేరకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. దూరప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సమయానికి రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవ సరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రశ్నపత్రాల తరలింపు, పత్రాల కవర్లు సీల్‌ తీయడం సీసీ కెమెరాల సమక్షంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. ఆ సమయంలో సెల్‌ఫోన్‌లు లోపలకి ఎంట్రీ ఉండ కూడదని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు అధి కారి కల్పన, ఆర్డీఓ గంగయ్య, ఏసీపీ కృష్ణ, అధికా రులు ప్రకాష్‌, వెంకటేష్‌, రమేష్‌ పాల్గొన్నారు.

గణతంత్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ వేణు అధికారులను ఆదే శించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమా వేశంలో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని ప్రతిశాఖకు చెందిన అధికారులు, సిబ్బంది వేడుకలకు తప్పని సరిగా హాజరుకావాలని తెలిపారు. పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను సమకూర్చాలన్నారు. ప్రోటోకాల్‌ నిబం ధనలు అధికారులు పాటించాలన్నారు. ఏఎన్‌ఎంల ఆధ్వర్యంలో వైద్యబృందాలను ఏర్పాటు చేయాల న్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల కోసం పాఠశాల విద్యార్థులను తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం కలె క్టరేట్‌ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Updated Date - Jan 22 , 2026 | 12:03 AM