Share News

అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:01 AM

సింగరేణి టెండర్లలో అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని టీబీజీకేఎస్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ బుధవారం ఆర్జీ-1 జీఎం ఆఫీస్‌ ఎదుట ధర్నాకు దిగారు. యూనియన్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు.

 అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

గోదావరిఖని, జనవరి 21(ఆంధ్రజ్యోతి): సింగరేణి టెండర్లలో అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని టీబీజీకేఎస్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ బుధవారం ఆర్జీ-1 జీఎం ఆఫీస్‌ ఎదుట ధర్నాకు దిగారు. యూనియన్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో సింగరేణిని నిలువు దోపిడి చేసిందని ఆరోపించారు. ఓబీ టెండర్లలో రాష్ట్ర మంత్రులు జోక్యం చేసుకోవ డం, తమ అనుచరులకు దక్కేలా సైట్‌ విజిట్‌ నిబంధన బహిర్గతం అయి నట్టు తెలిపారు.

టెండర్లు రద్దు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, అవకతవకలు జరగకుంటే టెండర్‌ ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. సింగరేణిలో అక్రమాలు జరుగుతున్నట్టు బహిర్గతం అయినా బొగ్గు శాఖా మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నైనీ బ్లాక్‌ టెండర్లను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణికి రావాల్సిన బకాయి లను ఇప్పించాలని, సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిలువరించాలని అన్నారు. మాదాసి రామ్మూర్తి, నూనె కొంరయ్య, వడ్డెపల్లి రవి, సతీష్‌, రాజేశం, జోసఫ్‌, అభిషేక్‌రావు, కవితా, సరోజన, చిరంజీవి, పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 12:01 AM