విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:46 PM
క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకే విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టిజిఎన్‌పిడిసి ఎల్ ఏఈ రాజేందర్ తెలిపారు. అడవీ శ్రీరాంపూర్‌లో మంగళవారం ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టారు.
ముత్తారం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకే విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టిజిఎన్‌పిడిసి ఎల్ ఏఈ రాజేందర్ తెలిపారు. అడవీ శ్రీరాంపూర్‌లో మంగళవారం ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల నుంచి విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. పాత స్తంభాలు తొలగించి కొత్తవి బిగిస్తామని, లూస్ లైన్లను సరి చేస్తామని చెప్పారు. సర్పంచ్ అన్నపూర్ణ ఉపేందర్, ఉప సర్పంచ్ హరిత తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలాజీ, ఎఎంసి వైస్ చైర్మన్ రాజయ్య, మైనారిటీ మండల అధ్యక్షులు వాజీద్ పాషా, కార్యదర్శి మల్లీశ్వరీ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ప్రజాబాట కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యుత్ ఏఈ సంపత్ రెడ్డి తెలిపారు. రాములపల్లిలో ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టి, ప్రజలు, రైతుల నుంచి సమస్యలపై చర్చించారు. విద్యుత్ సంస్థ అందుబాటులోకి తె చ్చిన టోల్‌ఫ్రీ నెంబర్ 1912ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్పంచ్ సిద్ది తిరుపతి, ఉపసర్పంచ్ తీట్ల విద్యాలత విజయ్, సబ్ ఇంజనీర్ రాజమల్లయ్య, ఎల్‌ఐ సూర్యనారాయణ, ఎల్‌ఎం భాస్కర్, ఏఎల్‌ఎం లక్ష్మణ్, జీపీ కార్యదర్శి హరిబాబు, పాల్గొన్నారు.
కమాన్‌పూర్, (ఆంధ్ర జ్యోతి): గుండారంలో సర్పంచ్ జంగిలి పోచాలు అధ్యక్షతన ఏడీఈ వెంకట్ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కా రానికి చర్యలు చేపట్టారు. అలాగే 1912 టోల్‌ఫ్రీ నెం బర్‌ను సద్వినియోగం చేసుకుని నేరుగా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఉపసర్పంచ్ అంబిరి రాజేందర్, సీని యర్ లైన్‌ఇన్‌స్పెక్టర్ సిరిపల్లి కృష్ణ, లైన్‌ఇన్‌స్పెక్టర్ సత్య నారాయణరావు, లైన్‌మెన్ ఓదెలు ముదిరాజ్, నాగరాజు, సిబ్బంది, సంతు, సునీల్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.