సర్వేలు..చర్చలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:48 AM
మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్,వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో సిరిసిల్ల, వేములవాడలో రాజకీయ సందడి మొదలైంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పెద్దలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో తలమునకలవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్,వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో సిరిసిల్ల, వేములవాడలో రాజకీయ సందడి మొదలైంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పెద్దలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో తలమునకలవుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, గెలుపు సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చలు, పోటీకి ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చిన వార్డుల్లో ఆశావహులను బుజ్జగించడం వారిని పోటీ నుంచి తప్పించే దిశగా ఆయా పార్టీల పెద్దలు బిజీబిజీగా మారిపోయారు. సిరిసిల్ల మున్సి పాలిటీలో 39 వార్డులు, వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డుల్లో పోటీకి సిద్ధమైన ఆశాశహులు బీఫామ్ దక్కించుకోవడానికి పార్టీల పెద్దల చుట్టూ చెక్కర్లు కొడుతు న్నారు. గుర్తులతో ప్రమేయం లేకుండా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో హోరా హోరీగా తలపడిన అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిక్షాలు బీఆర్‌ఎస్, బీజేపీలు పార్టీల గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించడానికి పకడ్బందీగా వ్యవహ రిస్తుండటంతో ఆశావహుల్లో టికెట్ టెన్షన్ పట్టుకుంది. పార్టీల పెద్దలు ఎవరి వైపు కరుణచూపుతారనే ఆసక్తి పెరిగింది.
సర్వేలు.. ఇంటెలిజెన్స్ రిపోర్టులు
సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు సర్వేలపై దృష్టిపెట్టాయి. బీఆర్‌ఎస్ వార్డుల వారీగా బృందాలను నియ మించి సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే సర్వేలతో అంచనాకు వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన అభ్యర్థులను బరిలో దింపే విధంగా సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్టుల పైన ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ సర్వేను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారని చర్చ ఎక్కువగా ఉంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో మున్సిపల్ టిక్కెట్ల విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.
పలువురు ఆశావహులకు నిరాశ
సిరిసిల్ల చైర్‌పర్సన్ జనరల్ మహిళ, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ బీసీ జనరల్‌కు రిజర్వుడు కాగా రెండు మున్సిపాలిటీలోని 67 వార్డుల రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. రిజర్వేషన్లు ప్రకటించడంతో అనుకూలంగా రిజర్వేషన్లు రాకపోవడంతో చాలామందికి నిరాశే మిగిలింది. రొటేషన్ పద్ధతిలో పోటీ నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది. ఆశించిన రిజర్వేషన్లు రానివారు తమ అనుచరులకు మద్దతు ఇచ్చే పనిలో పడ్డారు. మరికొందరు తమకు రిజర్వేషన్లు అనుకూలంగా ఉండి పట్టు సాధిస్తామనే నమ్మకం ఉన్న వార్డులపైన దృష్టి పెట్టారు. పార్టీ టికెట్ లభించని పక్షంలో స్వతం త్రులుగా రంగంలో దిగడానికి సిద్ధమవుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో రిజర్వేషన్ల కేటాయింపులతో అభ్యర్థుల గెలుపులపై చర్చలు మొదల య్యాయి.
సిరిసిల్ల మున్సిపాలిటీలో రిజర్వేషన్లు
సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్ 1, ఎస్సీలకు 3, బీసీలకు 15, జనరల్ 20 రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం కోటా నిర్ణయించగా దాని ప్రకారం 12 వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. మూడు ఎస్సీ రిజర్వ్ కోటాలో 1వ వార్డు, 22 వ వార్డు ఎస్సీ జనరల్‌కు, 8 వ వారు ్డమహిళకు, బీసీలకు 15వార్డులు రిజర్వ్ కాగా బీసీ మహిళలకు 03, 04, 05, 10, 31, 38,39 వార్డులు, బీసీ జనరల్ వార్డుల్లో 02, 07, 11, 13,14, 16, 17, 20, వార్డులు రిజర్వ్ అయ్యాయి. జనరల్ వార్డుల్లో జనరల్ మహిళ రిజర్వ్‌లో 06,09, 15,18, 23, 27, 28, 29, 30,36.37. వార్డులు, జనరల్ వార్డుల్లో 19, 21, 24,25,26, 32,33,34, 35, కేటాయించారు.
వేములవాడ మున్సిపాలిటీలో రిజర్వేషన్లు
వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్‌గా 12వ వార్డు, ఎస్సీ రిజర్వేషన్‌లో ఎస్సీ మహిళకు 3, 13, వార్డులు, ఎస్సీ జనరల్‌గా 17, 20 వార్డులు, బీసీల రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు 1, 11, 23, 27 వార్డులు, బీసీ జనరల్‌గా 8, 15, 16, 21, 24 వార్డులు రిజర్వ్ అయ్యాయి. జనరల్ కోటాలో జనరల్ మహిళలలకు 2, 5, 9, 10, 19,22, 26, 28 వార్డులు, జనరల్ వార్డులుగా 4, 6, 7, 14, 18, 25 వార్డులు కేటాయించారు.