Share News

జాతర పనులను వేగవంతం చేయండి

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:42 PM

గోదావరిఖని సమ్మక్క - సారలమ్మ జాతర పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మక్కా న్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అధికారులకు సూచించారు. మంగళవారం జాతర ప్రాంగణంలో ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

జాతర పనులను వేగవంతం చేయండి

గోదావరిఖని, జనవరి 20(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని సమ్మక్క - సారలమ్మ జాతర పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మక్కా న్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అధికారులకు సూచించారు. మంగళవారం జాతర ప్రాంగణంలో ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, జాతర ప్రాంగణంలో మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. జాతర ప్రాంగ ణంలో మట్టి నింపడంలో సింగరేణి అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి, సీఎండీ చెప్పినా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తక్షణమే డంపర్ల ద్వారా మట్టి నిం పాలని సూచించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా సింగరేణి, మున్సిపల్‌ అధికారులు సమన్వయం చేస్తూ పనులు పూర్తి చేయాలని, లైటింగ్‌, మంచినీటి కొరత లేకుండా చూడాలని సూచించారు. అనం తరం జాతర ప్రాంగణంలో నిర్మించిన హాల్స్‌, గోదావరి వద్ద స్నాన ఘట్టాలను, ముఖద్వారాలను పరిశీలించారు. సింగరేణి డీజీఎం వర ప్రసాద్‌, మున్సిపల్‌ ఈఈ రామన్‌, ఆర్‌టీసీ డీఎం నాగభూషణం, నాయకులు మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, దీటి బాలరాజు, జాలి రాజమణి, జాతర కమిటీ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, సింగరేణి శ్రీనివాస్‌, కందూరి శ్రీనివాస్‌రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, టుటౌన్‌ సీఐ ప్రసాద్‌రావు, ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్‌ఐ హరిశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:42 PM