నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:44 PM
నిరుపేదలందరికి విడుతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్లు పనులు ప్రారంభించి ప్రొసిడింగ్‌లు అందజేసిన అనం తరం మాట్లాడారు.
పెద్దపల్లి టౌన్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలందరికి విడుతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్లు పనులు ప్రారంభించి ప్రొసిడింగ్‌లు అందజేసిన అనం తరం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెర వేరుతోందని, అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని హామీఇచ్చారు. పట్టణంలో అనేక మంది సొంతిల్లు లేని పేద ప్రజలు ఉన్నారని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ పేరిట పేదలను మోసం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు అందజేసి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ నిరంతరంగా కొనసాగుతోందన్నారు. జిల్లా కేంద్రంలో బస్సు డిపో, బైపాస్ రోడ్డు, 50 పడకల నుంచి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆధునికీకరణ, కోర్టు భవనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఏఈ, మున్సిపల్ అధికారులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.